Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??

మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??

Phani CH

|

Updated on: May 15, 2024 | 7:40 PM

మనసులు కలిసిన జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు ఉన్న మార్గాలు అరేంజ్డ్ మ్యారేజ్ లేదా లవ్ మ్యారేజ్. ఇది అందరికీ తెలిసిందే. కానీ జపాన్ లో ఓ నయా మ్యారేజ్ ట్రెండింగ్ అవుతోంది! ఈ సరికొత్త బంధం యువతను తెగ ఆకర్షిస్తోంది! దాని పేరే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్! ఇదొక హైబ్రీడ్ పెళ్లి అని చెప్పవచ్చు. ఈ పెళ్లిలో జీవితాంతం తోడుంటానని, నాతిచరామి అంటూ ఒట్టు వేయాల్సిన పనేమీ లేదట! జస్ట్ నచ్చినన్ని రోజులు, వారాలు, నెలలు, మహా అయితే కొన్నేళ్లు కలిసి ఉంటామని అగ్రిమెంట్ పై సంతకాలు చేస్తే సరిపోతుందట!

మనసులు కలిసిన జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు ఉన్న మార్గాలు అరేంజ్డ్ మ్యారేజ్ లేదా లవ్ మ్యారేజ్. ఇది అందరికీ తెలిసిందే. కానీ జపాన్ లో ఓ నయా మ్యారేజ్ ట్రెండింగ్ అవుతోంది! ఈ సరికొత్త బంధం యువతను తెగ ఆకర్షిస్తోంది! దాని పేరే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్! ఇదొక హైబ్రీడ్ పెళ్లి అని చెప్పవచ్చు. ఈ పెళ్లిలో జీవితాంతం తోడుంటానని, నాతిచరామి అంటూ ఒట్టు వేయాల్సిన పనేమీ లేదట! జస్ట్ నచ్చినన్ని రోజులు, వారాలు, నెలలు, మహా అయితే కొన్నేళ్లు కలిసి ఉంటామని అగ్రిమెంట్ పై సంతకాలు చేస్తే సరిపోతుందట! దీంతో జపనీయులు ఈ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ తరహా పెళ్లిళ్లు చేసి పెడుతున్న కొలొరస్ అనే సంస్థ వెల్లడించింది. 2015 నుంచి 500 మందికి తమ సంస్థ ఇలా ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లు చేసినట్లు చెప్పింది. ఈ జాబితాలో అలైంగికులు, స్వలింగ సంపర్కులు, బహులింగ సంపర్కులు కూడా ఉన్నారండోయ్! ఇదేదో భలే ఉందే… మన దేశంలో కూడా ఉంటే బావుణ్ణు అనుకుంటున్నారా? కొంచెం ఆగండి.. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లో జస్ట్ స్నేహం మాత్రమే ఉంటుందట. అంటే ఇంకా అర్థం కాలేదా? ఈ పెళ్లి తర్వాత దంపతుల మధ్య రొమాన్స్, సెక్స్, పిల్లల్ని కనడం లాంటివి ఉండవండోయ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క కారుకు దారిచ్చేందుకు ఆగిన పదుల వాహనాలు

వామ్మో.. ఇదేం చూపురా నాయనా.. నెటిజన్లు బెంబేలు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు

మీ ముఖం చందమామలా వెలిగిపోవాలంటే ఇలా చేయండి !!

Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చక్కటి ఫుడ్స్ ఇవే..

Allu Aravind: రామాయణ మేకర్స్‌కు నోటీసులిచ్చిన అల్లు అరవింద్

Published on: May 15, 2024 06:41 PM