Watch Video: వామ్మో .. వానరసైన్యంతో పెట్టుకున్నారో ఇక అంతే..! చిరుతపులికే చెమటలు పట్టించాయి.. వీడియో చూశారంటే..
ఈ వైరల్ వీడియో ప్రారంభంలో చిరుతపులి రోడ్డు వెంట నడుస్తూ కనిపించింది. ఈ సమయంలో చిరుత వేట కోసం వెళ్తుందని తెలుస్తోంది. అప్పుడే దారి మధ్యలో ఒక పెద్ద కోతుల గుంపు నడుస్తూ కనిపించింది. కోతులను చూసిన చిరుతపులి తన వేటను చూసి సంతోషిస్తుంది. వెంటనే ఆ చిరుతపులి కోతుల వైపుకు పరిగెత్తి ఒక కోతిపై దాడి చేస్తుంది. ఈ చిరుత కోతుల గుంపులోకి ప్రవేశించి వేటాడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, దానికి తెలియదు పాపం వానరసైన్యం బలమెంతో.
ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఓడించలేరు అనే నానుడి నిజమని నిరూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతిపై దాడి చేసిన చిరుతపులికి ఆ వానర సైన్యమంతా కలిసి గట్టి గుణపాఠం చెప్పింది. కోతి మూక దాడితో చిరుతపులి తోకముడవాల్సి వచ్చింది. వేటకు వెళ్లిన చిరుతపులిని తరిమి తరిమి ఉరికించిన కోతుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని గ్రామీణ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
ఈ వైరల్ వీడియో ప్రారంభంలో చిరుతపులి రోడ్డు వెంట నడుస్తూ కనిపించింది. ఈ సమయంలో చిరుత వేట కోసం వెళ్తుందని తెలుస్తోంది. అప్పుడే దారి మధ్యలో ఒక పెద్ద కోతుల గుంపు నడుస్తూ కనిపించింది. కోతులను చూసిన చిరుతపులి తన వేటను చూసి సంతోషిస్తుంది. వెంటనే ఆ చిరుతపులి కోతుల వైపుకు పరిగెత్తి ఒక కోతిపై దాడి చేస్తుంది. ఈ చిరుత కోతుల గుంపులోకి ప్రవేశించి వేటాడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, దానికి తెలియదు పాపం వానరసైన్యం బలమెంతో. తమపై వేటకు వచ్చిన చిరుతపులిపై దాదాపు 50 కోతులు కలిసి చుట్టుముట్టాయి. ఈ చిరుతపులి ఆట ఆడుకున్నాయి.
ఈ వైరల్ వీడియోలో దాదాపు 50-60 కోతుల గుంపు చిరుతపులిపై దాడి చేసి చిరుతను ఓడించింది. కోతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చిరుతపులి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో బతికి ఉంటే చాలునని గ్రహించిన ఆ చిరుత ప్రాణాల కోసం పరుగులు తీసింది. కానీ, ఆ కోతులు దాన్ని తప్పించుకోనివ్వలేదు. దాని వెంటపడి మరీ ఉరికించాయి. ఇదంతా రోడ్డుపై ఆగిపోయిన వాహనదారులు వీడియోలో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
Leopard thought he could eat a baboon in front of his whole troop 😳 pic.twitter.com/Khz5OLn5jc
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 12, 2024
అయితే, ఈ వీడియో చాలా పాతదే అయినా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో @AMAZlNGNATURE అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశారు. ఇప్పటికే 18.3 మిలియన్లకు పైగా వీడియోని వీక్షించారు. 127 వేలకు పైగా లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు. ఈ కోతుల ఐక్యతను అందరూ మెచ్చుకున్నారు. “దీన్నే ఐక్యత బలం అంటారు” అని ఈ కోతుల గుంపు నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..