Watch Video: బుల్లి క్రేన్‌లో లారీ మంది ఎక్కితే ఇలాగే అవుతుంది మరీ..! షాకింగ్ వీడియో వైరల్
మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపు సందర్భంగా కొందరు వ్యక్తులు క్రేన్ ఎక్కారు. ఈ ఆకస్మిక సంఘటన తో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న కొంతమంది దంతా తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయటంతో అది కాస్త నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కెమెరాకు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపు సందర్భంగా కొందరు వ్యక్తులు క్రేన్ ఎక్కారు. కానీ, అక్కడి వారు చేసిన అత్యుత్సాహం, సందడి కారణంగా క్రేన్ బోల్తా పడింది. క్రేన్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. గురువారం మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా కర్హల్ చౌక్ వద్దకు రాజ్‌పుత్ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ వర్గం నేతలు క్రేన్‌పైకి ఎక్కారు. ఆ చౌక్‌లోని మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూల మాలలు వేసేందుకు ప్రయత్నించారు.
సమాచారం ప్రకారం, విగ్రహానికి పూలమాలలు వేయడానికి చాలా మంది క్రేన్ ఎక్కారు. దీని కారణంగా క్రేన్ ఒక వైపు ఓవర్‌లోడ్ కావడంతో ఒక్కసారిగా ముందుకు వంగిపోయింది. దీంతో క్రేన్ నిలబడి ఉన్న వాహనం బోల్తా పడింది. ఈ ఆకస్మిక సంఘటన తో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తూ అప్రమత్తమైన జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : मैनपुरी में राजपूत सभा के लोग क्रेन पर चढ़कर महाराणा प्रताप की प्रतिमा पर माल्यार्पण कर रहे थे। अचानक क्रेन गिर गई। हालांकि कोई चोटिल नहीं हुआ है।
इसी प्रतिमा पर 4 दिन पहले सपाई पहुंचे थे। जिसके बाद भाजपाइयों ने उस जगह को गंगाजल से धोया था। pic.twitter.com/rtXn4MQEU1
— Sachin Gupta (@SachinGuptaUP) May 9, 2024
వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రజలు సకాలంలో తప్పించుకోకపోతే ఈ సంఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారని నిర్వాహకులు తెలిపారు. కాగా, వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..