గగుర్పొడిచే దృశ్యం.! బురద గుంటలో నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్..

అడవిలో ఉన్నది ఒకే ఒక్క రూల్.. అక్కడ ఒక జంతువుకు ఆకలేసిందంటే.. మరో జంతువుకు మూడిందన మాటే. క్రూర జంతువులు తమ ఆకలి కోసం ఎప్పుడూ చిన్న జంతువులను వేటాడాల్సిందే. వేటాడే క్రూర జంతువులను చూసినప్పుడల్లా మనకు భయంకరంగా అనిపిస్తుంది కానీ.. అవి మాత్రం వాటి జీవన విధానంలోని ఓ భాగాన్ని..

గగుర్పొడిచే దృశ్యం.! బురద గుంటలో నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్..
Viral Video
Follow us

|

Updated on: May 14, 2024 | 12:49 PM

అడవిలో ఉన్నది ఒకే ఒక్క రూల్.. అక్కడ ఒక జంతువుకు ఆకలేసిందంటే.. మరో జంతువుకు మూడిందన మాటే. క్రూర జంతువులు తమ ఆకలి కోసం ఎప్పుడూ చిన్న జంతువులను వేటాడాల్సిందే. వేటాడే క్రూర జంతువులను చూసినప్పుడల్లా మనకు భయంకరంగా అనిపిస్తుంది కానీ.. అవి మాత్రం వాటి జీవన విధానంలోని ఓ భాగాన్ని పూర్తి చేస్తున్నాయంతే.. ఇదంతా అటుంచితే.. భూమిపై అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన జీవుల్లో మొదట ఉండే చిరుత.. కానీ.. అటు భూమి.. ఇటు నీరు.. రెండింటిలోనూ మొసలిని మించిన మరో ప్రాణి ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తారు. నీటిలో దానికి అంతటి సత్తా ఉంది. మరి అలాంటి మొసలి దగ్గర జీవించడం, వాటికి మాంసాన్ని మేత కింద వేయడం అంత సులభం అనుకుంటున్నారా.? కష్టమండీ బాబూ.! జంతువులకు సంబంధించి తరచూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. వీటిని చూసేందుకూ జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో చాలా వీడియోలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ భారీ సైజ్ మొసలి బురద గుంటలో దాక్కుని ఉంది. తన శరీరాన్ని పూర్తిగా బురదతో నింపేసి.. ఎర కోసం కాచుకుని కూర్చుంది. అలాంటి సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి దానికి మాంసాన్ని మేతగా వేస్తాడు. అది నిద్రపోతుందేమోనని అనుకుని.. తన వెంట తెచ్చుకున్న కెమెరాతో షూట్ చేద్దామని ప్రయత్నిస్తాడు. అంతే! గుండెలు అదిరేలా ఆ మొసలి అతడిపైకి దాడికి దిగుతుంది. కొద్ది దూరం వరకు ఆ వ్యక్తీని వెంటాడి మరీ పరుగులు పెట్టిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనికి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. అలాగే లైకులు మీద లైకులు చేస్తున్నారు నెటిజన్లు. ‘ఇలాంటి డేంజరస్ జంతువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘నిద్రపోతున్న మొసలిని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు, లేకుంటే ప్రాణాలకే డేంజర్’ అని మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.