Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్.. ఆర్థిక రాజధానిలో హైవేల దుస్థితి.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్ల ఫైర్

ప్రకృతి వైపరీత్యాలు, తొక్కిసలాటలు, వర్షాలు, బాంబులు పేలుళ్లు, వ్యాధుల వల్ల ఏడాదిలో ఎన్ని మరణాలు సంభవిస్తాయో, రోడ్లపై ఏర్పడ గుంతల వల్ల కూడా అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోడ్డు గుంతల విషయంలో ముంబై నగరం పేరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. వర్షాకాలం రాకముందే ముంబైలో రోడ్లపై గుంతల సమస్య మొదలైంది.

Viral Photo: అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్.. ఆర్థిక రాజధానిలో హైవేల దుస్థితి.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్ల ఫైర్
Most Dangerous Flyover
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2024 | 12:00 PM

చంద్రునిపైకి వెళ్లే మిషన్‌లో భారత్ విజయం సాధించింది. కానీ, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు చేస్తున్న ప్రచారాలు మాత్రం సఫలమయ్యేలా కనిపించడం లేదు. నేడు భారతదేశంలో జరుగుతున్న అనేక ప్రమాదాలకు రోడ్డు గుంతలే కారణమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, తొక్కిసలాటలు, వర్షాలు, బాంబులు పేలుళ్లు, వ్యాధుల వల్ల ఏడాదిలో ఎన్ని మరణాలు సంభవిస్తాయో, రోడ్లపై ఏర్పడ గుంతల వల్ల కూడా అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోడ్డు గుంతల విషయంలో ముంబై నగరం పేరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. వర్షాకాలం రాకముందే ముంబైలో రోడ్లపై గుంతల సమస్య మొదలైంది. థానేలోని పాట్లిపాడ ఫ్లైఓవర్‌పై రోడ్ల దుస్థితికి సంబంధించిన ఒక పోస్ట్‌ నెట్టింట తీవ్ర దుమారం లేపుతోంది. థానే మున్సిపల్ కార్పొరేషన్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ట్యాగ్‌ చేస్తూ ఒక మహిళ విమర్శించింది. ఆమె దాని గురించి X (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేసింది. థానేలోని పాట్లిపాడ ఫ్లైఓవర్‌పై రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించాలని పలువురు వినియోగదారులు నేరుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను అభ్యర్థించారు.

మహిళ తన పోస్ట్‌లో థానేలోని వాగ్‌బిల్ ఫ్లైఓవర్ గురించి ప్రస్తావించింది. అయితే, ఇది పాట్లిపాడు ఫ్లైఓవర్ అని ఒక వినియోగదారు చెప్పారు. ఆ తర్వాత అది పాట్లిపాడు ఫ్లై ఓవర్ అని వివరిస్తూ మహిళ మరో పోస్ట్ చేసింది. ఆ ఫ్లై ఓవర్‌ పరిస్థితి ఎంత నాసిరకంగా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

@QueenofThane అనే వినియోగదారు థానేలోని Patlipada ఫ్లైఓవర్ కొన్ని ఫోటోలను షేర్ చేసారు. దీనిపై ఆమె మాట్లాడుతూ థానేలో వాహనదారులకు ఇది అత్యంత ప్రమాదకర ఫ్లైఓవర్ అని అన్నారు. ఫోటోలో, వాహనదారులు, బైకర్లు అధ్వాన్నంగా వేసిన ఫ్లైఓవర్ రోడ్డుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని రాశారు.

వినియోగదారు క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు.. “ప్రియమైన @TMCaTweetAway @MMRDAOfficial మీరిద్దరూ పాట్లిపాడ ఫ్లైఓవర్‌ను థానేలోని వాహనదారులకు అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్‌గా వివరించారు. ఆమె చేసి ఈ పోస్ట్‌పై చాలా మంది వినియోగదారులు భిన్నమైన స్పందనలు తెలియజేశారు. థానేలో ఈ రహదారిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. చాలా మంది థానే మున్సిపల్ కార్పొరేషన్‌ను విమర్శించారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు . ఎందుకంటే- ఈ ఫ్లైఓవర్ రోజురోజుకు చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఈ అధ్వాన్నమైన రోడ్ల వల్ల ప్రతిరోజూ చాలా మంది చనిపోతున్నారు. అలాగే ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో నెలలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.