Watch Video: వార్నీ ఇదేం పైత్యం తల్లి..! తినడానికి ముందు ఎవరైనా ప్లేట్‌ కడుగుతారు.. నువ్వేంటిలా ఉన్నావ్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలా మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ..తినడానికి కడగాల్సింది రోటీని కాదు తల్లి, ప్లేట్ కడగాలని రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. వామ్మో ఈవిడ చేసిన వంట ఎవరూ తింటారో గానీ అంటూ ఫన్నీగా స్పందించారు.

Watch Video: వార్నీ ఇదేం పైత్యం తల్లి..! తినడానికి ముందు ఎవరైనా ప్లేట్‌ కడుగుతారు.. నువ్వేంటిలా ఉన్నావ్‌..
Washing Naan
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2024 | 10:56 AM

స్మార్ట్ ఫోన్స్ చవకగా లభిస్తున్నాయి. దానికి తోడుగా విచ్చలవిడిగా ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వినియోగం అనేది సామాన్యులకు కూడా బాగా అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో సెలిబ్రిటీలకు కొదువే లేకుండా పోతుంది. క్షణానికొక సెలిబ్రటీ పుట్టుకోస్తున్నారు. ఫేమస్ అవ్వాలనే కోరికతో చాలామంది చిన్నాపెద్దా తేడాలేకుండా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఫేమస్ అవుతున్నారో లేదో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ ట్రోల్ అవుతుంటారు. ఈ క్రమంలో కావలసినంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ కూడా దొరుకుతుంది. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇక్కడో యువతి చేసిన పనికి నెటిజన్లు మండిపడ్డారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ నాన్‌ రోటిని కాల్చటానికి ముందుగా నీటిలో కడిగింది. ఆ తర్వాత ప్యాన్‌పై వేసి దానికి నెయ్యి, నూనె ఏదో వేసి కాల్చింది. ఆ తర్వాత తినడానికి అప్పటికే తయారు చేసిన కూరతో వడించుకుని తింటోంది. ఇదేంటి చపాతీని ఇలా నీటితో కడిగి కాల్చటం అని అందరూ షాక్‌ అవుతున్నారు. రొట్టెను ఇలా ఎవరు తల్లి నీటితో కడిగి కాలుస్తారు అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్ లో రకరకాల వంటకాలు దొరుకుతున్నాయి. కాబట్టి, ఇదేం కొత్తది కాదనే అనుకోవాలి. అయితే, ఈ వీడియోను షేర్ చేసిన మహిళ పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందినవారిగా చెబుతున్నారు. కానీ, ఈ మహిళ చేసిన ఈ డేంజరస్ ప్రిపరేషన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోను ఇప్పటి వరకు 8 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో ‘ఎవ్రీథింగ్లీశయ్’ అనే ఖాతాతో షేర్ చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలా మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ..తినడానికి కడగాల్సింది రోటీని కాదు తల్లి, ప్లేట్ కడగాలని రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. వామ్మో ఈవిడ చేసిన వంట ఎవరూ తింటారో గానీ అంటూ ఫన్నీగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..