Toor Dal Benefits : ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు..! ఎందుకో తెలుసా?

కందిపప్పులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్,ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కంది పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం .

Toor Dal Benefits : ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు..! ఎందుకో తెలుసా?
Split Pigeon Peas
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2024 | 8:59 AM

కాయధాన్యాలు ప్రోటీన్‌కు మంచి మూలం. వీటిని రోజూ తినడం వల్ల ప్రొటీన్లే కాకుండా అనేక పోషకాలు కూడా అందుతాయి. పప్పులో చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటిలో కంది పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మీకు తెలుసా..? కందిపప్పులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్,ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కంది పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం .

కందిపప్పులో మంచి మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. మన మొత్తం ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. మీరు శాఖాహారులైతే మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ను పొందడానికి ఈ పప్పును మీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోండి. కంది పప్పులో అనేక రకాల ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అలాగే, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

కంది పప్పులో ప్రొటీన్‌తో పాటు మంచి పీచు ఉంటుంది. ఇవి కడుపును నిండుగా ఉంచి అతిగా తినడాన్ని నివారిస్తాయి. తద్వారా బరువు పెరగడం అదుపులో ఉంటుంది. కందిపప్పులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని డయాబెటిక్ బాధితులు కూడా హాయిగా తినచ్చు.

ఇవి కూడా చదవండి

కంది పప్పులో ఉండే బీ కాంప్లెక్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. గర్భధారణ సమయంలో స్త్రీకి సరైన పోషకాహారం లేకపోవడం శిశువు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీలు కందిపప్పును ప్రతిరోజు తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కంది పప్పు సులభంగా జీర్ణమవుతుంది.

అయితే, కందిపప్పును మితంగా తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ, ఎక్కువగా తీసుకోవటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కందిపప్పులో కొన్ని రకాల చక్కెరలు ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యే సమయంలో వాయువు పుట్టేలా చేస్తాయి. కొంతమంది అధికంగా కందిపప్పు తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కందిపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, కొంతమందిలో వాయువు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..