Triphala Health Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష త్రిఫల చూర్ణం.. పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు..
త్రిఫల పొడిని ఎంతో కాలంగా ఆయుర్వేదంలో హెర్బ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్దకానికి దివ్యౌషధం. శరీరంలో దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నయం చేయడంలో ఇది అద్భుతం చేస్తుంది. రోజూ త్రిఫల చూర్ణం తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతే కాకుండా త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. త్రిఫల చూర్ణం ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: May 12, 2024 | 7:20 AM

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: త్రిఫల పొడి కడుపులో కందెనగా పనిచేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇది కడుపు లోపలి పొరను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కడుపులో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే సహజ భేదిమందులు ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ఏజెంట్లు, మలబద్ధకంతో పోరాడడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది: కడుపు, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి త్రిఫల పొడి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మీ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం త్రిఫల చూర్ణం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కణాలను క్యాన్సర్ కణాలను పెరగకుండా నివారిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కి ఇది మంచి రెమిడీ.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: త్రిఫల ఒక మూలికా ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఏదైనా ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, పోరాడడంలో సహాయపడుతుంది. త్రిఫల శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం: త్రిఫల పొడి చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . ఇది మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

త్రిఫల చూర్ణం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. త్రిఫల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది యాంట్ డయాబెటిక్ గా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఇన్ల్ఫమేషన్ రాకుండా కాపాడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది.





























