Micro Oven: మీరు కూడా మైక్రోఓవెన్‌ వాడుతున్నారా..? ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం..!!

ఇప్పుడు చాలా మంది మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, త్వరగా అయిపోతుంది కదా అని ఏది పడితే అది మైక్రోవేవ్‌లో పెట్టొద్దొని చెబుతున్నారు నిపుణులు. మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. దీనిలో కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్‌ వంటి విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

Micro Oven: మీరు కూడా మైక్రోఓవెన్‌ వాడుతున్నారా..? ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం..!!
Micro Oven
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2024 | 7:51 AM

Microwave Oven : మైక్రోవేవ్ ఓవెన్‌ ప్రస్తుతం దీన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. దాదాపు అందరి ఇళ్లలో ఇదోక నిత్యవసరంగా మారిపోయింది. ఆహారాన్ని కొన్ని క్షణాల్లో వేడివేడిగా ప్రిపేర్ చేస్తుంది. వంట సమయాన్ని తగ్గించి సగం శ్రమని దూరం చేస్తుంది. అందుకే, ఇప్పుడు చాలా మంది మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, త్వరగా అయిపోతుంది కదా అని ఏది పడితే అది మైక్రోవేవ్‌లో పెట్టొద్దొని చెబుతున్నారు నిపుణులు. మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. దీనిలో కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్‌ వంటి విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

అల్యూమినియం ఫాయిల్ :

అల్యూమినియం ఫాయిల్ వంటి కొన్ని లోహాలను ఎప్పుడూ మైక్రోవేవ్ వాడకూడదు. అల్యూమినియం రేకులు చాలా సన్నని లోహం, ఇవి మైక్రోవేవ్‌ల ఉపయోగించినప్పుడు రేడియేషన్‌ను గ్రహించకుండా ప్రతిబింబిస్తాయి. ఇది పరికరం లోపల స్పార్క్‌కు కారణం కావచ్చు. ఒక్కోసారి మంటలు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గుడ్లు ఉడకబెట్టకూడదు :

గుడ్లను మైక్రోవేవ్‌లో ఎప్పుడూ ఉడికించ కూడదని అంటున్నారు. ఎందుకంటే గుడ్డు పెంకులతో సహా ఓవెన్‌లో పెట్టడం వల్ల లోపల అవి పేలి, విద్యుత్ ప్రమాదాలకు కారణం కావచ్చు. ఉడికించిన గుడ్లను పెంకు తీసేసిన తర్వాత వేడి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ పెంకులతో పాటు గుడ్డును లోపల పెట్టకూడదు.

మిగిలిపోయిన బంగాళాదుంప కూర :

మైక్రోవేవ్‌లో మిగిలిపోయిన బంగాళాదుంపలను మళ్లీ వేడి చేయాలనుకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. బంగాళాదుంపలను ఉడకబెట్టి, ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచకపోతే, వీటిల్లో క్లోస్ట్రిడియం బోటిలినమ్, బోటులిజం అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి అందులోనే వృద్ది చెందుతాయి. దీనిని వేడి చేసి తినడం వల్ల కడుపు నొప్పి రావొచ్చు. అందుకే వీటిని వీలైనంతగా ఫ్రిజ్‌లో పెట్టి కావాలనుకున్నప్పుడు తీసి గది ఉష్ణోగ్రత వరకూ వచ్చాక అప్పుడు వేడి చేయాలి.

నీరు వేడి చేయటం :

నీటిని వేడి చేసేందుకు కూడా కొంతమంది మైక్రోఓవెన్‌ ని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. నీటిని వేడి చేసే సమయంలో బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ నీటి బుడగలు పేలడం వల్ల ఒక్కొక్కసారి ఓవెన్ పేలే ప్రమాదం ఉంది. ఒకవేళ నీటిని వేడి చేయాలి అనుకుంటే, గోరువెచ్చగా, లేదంటే చాలా తక్కువ సమయంలోనే బయటికి తీసేయాలి.

పుట్టగొడుగులు :

పుట్టగొడుగలను మైక్రోవేవ్‌లో వండినా, ఉడికించినా, వేడి చేసినా దానిలో పోషకాలు నశిస్తాయి. మైక్రోవేవ్‌లోని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ కారణంగా పుట్టగొడుగుల్లోని పోషకాలు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.