- Telugu News Photo Gallery Mango seeds are very beneficial can provide relief from these health problems Telugu Lifestyle News
Mango Seed Benefits: మామిడి గింజల్లో దాగున్న ఆరోగ్య, సౌందర్య రహస్యాలు తెలిస్తే.. ఇకపై పారేయరు..!
వేసవి కాలం అంటేనే మామిడి సీజన్. ఇలాంటప్పుడు అందరి ఇళ్లలో మామిడిపండ్లే కనిపిస్తాయి. మామిడి పండ్లకు మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సందర్భంగా రకరకాల మామిడి వంటకాలను రుచి చూడవచ్చు. అయితే, మామిడి పండు మాత్రమే కాదు, దాని టెంకు, అందులోని గింజ కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుందని మీకు తెలుసా? ఈ ఆర్టికల్‌లో మామిడి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Updated on: May 11, 2024 | 8:03 PM

వేసవి కాలం అంటేనే మామిడికాయల కాలం. మామిడి పండ్లను చిన్న పిల్లల నుండి పెద్ద వరకు అందరూ ఇష్టపడతారు. పచ్చి, పండిన పండ్లు అందరూ ఎంతో ఇష్టం తింటారు. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు. చూడగానే తినాలని అనిపిస్తుంది. పండిన మామిడి శరీర బరువును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Mango Seeds - మామిడి గింజ రక్త ప్రసరణను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర, సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గించడంలో పరోక్షంగా సహాయపడుతుంది. మామిడి గింజల వెన్నను సహజ లిప్ బామ్‌గా హైడ్రేట్ చేయడానికి, పొడి బారిన పెదాలను మృదువుగా చేయడానికి ఉపయోగించవచ్చు. పడుకునే ముందు పొడి పెదాలపై దీన్ని అప్లై చేయండి. ఇది చర్మ కణాలను మాయిశ్చరైజ్ చేస్తుంది.

Mango Seeds - మామిడి గింజల నుండి స్క్రబ్ తయారు చేయవచ్చు. ఇది మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది. మామిడిగింజల గుజ్జును మెత్తగా చేసి టొమాటోతో కలిపి ముఖానికి సమానంగా రాసుకోవాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మొటిమలు, మచ్చలకు చికిత్స చేయడానికి, రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మామిడి గింజల నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్. చర్మానికి పోషణ మరియు తేమతో పాటు, ఇది అనేక లోషన్లలో ఉపయోగించబడుతుంది.

Mango Seeds - మామిడి గింజలు తెల్ల జుట్టు, చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడతాయి. మామిడి గింజల పొడిని ఆవాల నూనెతో కలిపి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల బట్టతల, జుట్టు రాలడం, అకాల నెరవడం, చుండ్రు వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. మామిడి గింజలు చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడతాయి.

Mango Seeds- మామిడి గింజల పొడితో పళ్లు తోముకుంటే, దంతాలు మిలమిలలాడుతాయి. మామిడి గింజల పొడిలో కొంత తేనె కలిపి తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. మామిడి గింజల సారం.. బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. మామిడి గింజల్ని మితంగా వినియోగిస్తే.. హృదయ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ అద్భుతంగా పని చేస్తుంది.





























