AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుట్ట లాంటి పొట్టకు బ్రహ్మాస్త్రం.. ఈ నీటిని ఖాళీకడుపుతో తాగారంటే కొవ్వు మొత్తం పిండేసినట్లే..

నేటి ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. దాన్ని వదిలించుకోవడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఈ ప్రయాణంలో చాలామంది ఫలితం సాధించలేరు.. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఊబకాయం గురించి ఆందోళన చెందుతున్నట్లయితే.. కొన్ని చిట్కాలతో ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు..

గుట్ట లాంటి పొట్టకు బ్రహ్మాస్త్రం.. ఈ నీటిని ఖాళీకడుపుతో తాగారంటే కొవ్వు మొత్తం పిండేసినట్లే..
Weight Loss
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2024 | 7:39 AM

Share

నేటి ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. దాన్ని వదిలించుకోవడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఈ ప్రయాణంలో చాలామంది ఫలితం సాధించలేరు.. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఊబకాయం గురించి ఆందోళన చెందుతున్నట్లయితే.. కొన్ని చిట్కాలతో ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు.. అలాంటి ఒక పానీయం గురించి ఇప్పుడు తెలుసుకోండి.. ఈ పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, కొద్ది రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.. ఆ పానీయం గురించి తెలుసుకోండి..

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి..

గోరు వెచ్చని నీరు.. మెంతుల నీరు..

ఊబకాయం తగ్గాలంటే ముందుగా నిద్రలేచిన వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. దీని తర్వాత మెంతి గింజలతో చేసిన ఈ డ్రింక్ తాగవచ్చు. దీన్ని చేయడానికి, రాత్రి పడుకునే ముందు కొన్ని మెంతులు గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి.. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా చేసి, వడకట్టండి.. ఆ తర్వాత దాన్ని టీ లాగా త్రాగాలి.

ఇది మీ బొడ్డు కొవ్వు (బెల్లీ ఫ్యాట్‌) ను సులభంగా తగ్గిస్తుంది. మీ శరీరం తేలికగా మారుతుంది. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల ఊబకాయంతో పాటు, మీ జుట్టు, చర్మానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మెంతులు జుట్టును బలోపేతం చేస్తాయి.. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. చర్మాన్ని మెరిసేలా అందంగా మార్చడానికి మెంతి గింజలు కూడా ఉత్తమైన ఎంపిక.

వాము నీరు..

బరువు తగ్గడానికి వాము నీటిని కూడా తాగవచ్చు. ఇది గ్యాస్, అసిడిటీ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని చేయడానికి, ఒక చెంచా వామును 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, కొద్దిగా వేడి చేసి వడపోసి, తర్వాత టీ లాగా త్రాగాలి.

ఇలా రోజూ చేయడం వల్ల స్థూలకాయం తొలగిపోవడంతోపాటు అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ రెండు పానీయాల సహాయంతో, మీరు మీ ఊబకాయాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. కొందరికి ఈ పానీయాల వల్ల అలర్జీలు లేదా సమస్యలు ఉండవచ్చు. కావున ముందుగా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..