కొరియన్ల వంటి గ్లాస్‌ స్కిన్‌ కోసం చియా సీడ్స్‌..! ఇలా వాడితే మెరిసే అందం మీ సొంతం..

మరింత త్వరగా ప్రయోజనాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. చియా సీడ్ పౌడర్, లేదా చియా గింజలతో తయారు చేసిన ఫేషియల్ స్క్రబ్‌లు లేదా మాస్క్‌లు చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. దీంతో మీ చర్మం తాజాగా, ప్రకాశవంతంగా, పునరుజ్జీవనం పొందేలా చేస్తుంది.

కొరియన్ల వంటి గ్లాస్‌ స్కిన్‌ కోసం చియా సీడ్స్‌..! ఇలా వాడితే మెరిసే అందం మీ సొంతం..
Chia Seeds For The Glowing Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2024 | 10:14 AM

చియా విత్తనాల గురించి మనందికీ తెలిసిందే. ఈ చిట్టి విత్తనాలు ఆరోగ్యానికి వరం వంటివి. ఇందులో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు-138, ప్రోటీన్-4.7 గ్రా, కొవ్వు-8.7 గ్రా, పిండి పదార్థాలు-11.9 గ్రా, ఫైబర్-9.8 గ్రా, రోజుకు అవసరమైన కాల్షియంలో 14 శాతం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ B1, విటమిన్ B3. అయితే ఈ గింజను ఉపయోగించడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుందని మీకు తెలుసా? అంతే కాకుండా జుట్టుకు బలం చేకూరుస్తుంది. కాబట్టి, దీన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ నేర్చుకుందాం.

అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండిన చియా విత్తనాలు ప్రకాశవంతమైన, ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని పొందడానికి సహజమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తాయి. మీ చర్మ సంరక్షణ దినచర్యలో చియా సీడ్స్‌ని యాడ్ చేసుకోవటం వల్ల మెరిసే ఛాయను పొందుతారు.  చియా గింజల్లో విటమిన్ సి, ఎ, ఫోలేట్, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దాని కోసం మీరు ఈ విత్తనాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే కొన్ని వారాల్లో మార్పును గమనిస్తారు. అలాగే, చియా గింజలు మంచి మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చియా గింజల్లో నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని మాత్రమే కాకుండా చర్మాన్ని కూడా తేమగా ఉండేలా చేస్తుంది.

చియా విత్తనాలు యాంటీఆక్సిడెంట్ భాగాలను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ సమస్యను నివారిస్తాయి. దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేస్తాయి. అలాగే ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. దీని కారణంగా, ముడతలు, ఫైన్ లైన్స్ వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తుంది. చియా విత్తనాలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మెరుస్తూ, మృదువుగా మారుతుంది. ఇది కాకుండా వాపు సమస్యను తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం: ముందుగా, చియా గింజలను కాసేపు నీటిలో నానబెట్టండి. అవి బాగా నాని మంచి జిగురులా ఏర్పడిన తర్వాత దానికి ఆలివ్ ఆయిల్ లేదా తేనె కలిపి, ఆపై మీ ముఖం, చేతులు, పాదాలు లేదా మొత్తం శరీరంపై అప్లై చేయండి. మరింత త్వరగా ప్రయోజనాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. చియా సీడ్ పౌడర్, లేదా చియా గింజలతో తయారు చేసిన ఫేషియల్ స్క్రబ్‌లు లేదా మాస్క్‌లు చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. దీంతో మీ చర్మం తాజాగా, ప్రకాశవంతంగా, పునరుజ్జీవనం పొందేలా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..