Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నారా..? ఉత్తరాఖండ్‌లోని ఈ అందమైన పర్యాటక ప్రదేశాలను మిస్‌ చేసుకోకండి..! మీ బడ్జెట్‌లోనే..

ఈ ఏడాది కూడా కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచే సమయంలో వేలాది మంది భక్తులు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు కేదార్‌నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం, గంగోత్రి ఆలయం, యమనోత్రి ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే, ఈ నాలుగు ఆలయాలతో పాటు ఉత్తరాఖండ్‌లో సందర్శించదగిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి..

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నారా..? ఉత్తరాఖండ్‌లోని ఈ అందమైన పర్యాటక ప్రదేశాలను మిస్‌ చేసుకోకండి..! మీ బడ్జెట్‌లోనే..
Uttarakhand
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2024 | 12:30 PM

హిమాలయ పర్వతాల్లో ఉండే నాలుగు దేవాలయాలను దర్శించే యాత్రను చార్ ధామ్ అంటారు. అందులో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాలను జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించాలన్నది హిందువులలో కొందరి విశ్వాసం. ఇవన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అక్షయ తృతీయ (మే10వ తేదీన) రోజున కేదారీనాథ్ ఆలయ తలుపలు తెరుచుకున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచే సమయంలో వేలాది మంది భక్తులు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు కేదార్‌నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం, గంగోత్రి ఆలయం, యమనోత్రి ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే, ఈ నాలుగు ఆలయాలతో పాటు ఉత్తరాఖండ్‌లో సందర్శించదగిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి..

హిమాలయాలలో మంచుతో కప్పబడిన పర్వతాలలో ఉన్న చార్‌దామ్‌ క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం అత్యంత అందమైన, పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి. శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్ ఆలయం ప్రసిద్ధి. కేదార్‌నాథ్ ఆలయానికి సమీపంలో సందర్శించడానికి ఉత్తమ స్థలాలు కేదార్‌నాథ్ ఆలయం, చంద్రశిలా, చోప్తా, అగస్త్యముని, వాసుకితాల్, సోనప్రయాగ, గౌరీకుండ్, శంకరాచార్య సమాధి కూడా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

చంద్రశిల రుద్రప్రయాగ జిల్లాలోని ఒక పర్యాటక ప్రదేశం. చంద్రశిల 3679 మీటర్ల ఎత్తులో ఉంది. చంద్రశిల ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఒకటి. అలాగ, చోప్తా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం. ఇది 2900 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ తుంగనాథ్ దేవాలయం కూడా ఉంది. మంచుతో కప్పబడిన ఈ పర్వతంపై ట్రెక్కింగ్ ప్రియులకు ఒక అసాధారణ అనుభవం.

ఇవి కూడా చదవండి

గౌరీకుండ్ పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయానికి 14 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌లో ముఖ్యమైన ప్రదేశం. గౌరీకుండ్ సముద్ర మట్టానికి 1,982 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశంలో పార్వతి దేవి పేరు పెట్టారు. ప్రసిద్ధ గౌరీ ఆలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం, గౌరీకుండ్‌లో పార్వతీ దేవి శివుడిని తన భర్తగా పొందేందుకు తపస్సు చేసిందని చెబుతారు.

సోన్‌ప్రయాగ్ 1829 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక సుందరమైన ప్రదేశం. సోనప్రయాగ అందంతో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ చిన్న గ్రామం మందాకిని, వాసుకి అనే రెండు పవిత్ర నదుల సంగమం వద్ద ఉంది. మంచుతో కప్పబడిన భారీ పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం అద్భుతమైన ప్రశాంత వాతావరణం, ఆనందాన్ని అందిస్తుంది.

వాసుకితాల్‌ పవిత్ర స్థలం హిమాలయాలలోని ఎత్తైన పర్వత శిఖరాలతో చుట్టుముట్టబడి ఉంది. స్వచ్ఛమైన నీటికి ప్రసిద్ధి చెందిన కేదార్‌నాథ్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో వాసుకి తాల్ ఒకటి. మంచు పర్వతాలలో 4135 మీటర్ల ఎత్తులో ఉన్న వాసుకితాల్‌ ఎక్కడం పర్యాటకులకు నిజంగా అపురూపమైనది.

అగస్త్య ముని దేవాలయం అగస్త్య మహర్షికి ప్రసిద్ధి. పురాతన నమ్మకం ప్రకారం, అగస్త్య మహర్షి ఇక్కడ ఒక సంవత్సరం పాటు తపస్సు చేశాడు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఈ పవిత్ర ఆలయానికి బైశాఖి పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తారు. ఎత్తైన కొండలపై ఉన్న ఈ పురాతన దేవాలయం నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ.

భారతదేశపు గొప్ప తత్వవేత్త ఆదిశంకరాచార్యుల సమాధి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆదిశంకరాచార్యులు కేదార్‌నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు. చరిత్ర ప్రకారం, ఆదిశంకరాచార్య సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి భారతదేశం అంతటా పర్యటించారు. ఆదిశంకరాచార్య కేదార్‌నాథ్‌కు వచ్చి 8వ శతాబ్దంలో ఈ పవిత్ర ఆలయాన్ని పునరుద్ధరించారు. హిందూమతం చార్ధామ్ మఠాన్ని స్థాపించారు. శంకరాచార్య సమాధి భక్తులకు అందమైన, నిర్మలమైన, పవిత్రమైన ప్రదేశంగా గుర్తింపును పొందింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు