ముఖ్యంగా వీటిలో బి-కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్-కె, విటమిన్-ఏ, ఐరన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం లాంటి ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. ఖర్జూరం తినడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, రొమ్ము క్యాన్సర్, మలబద్ధకం లాంటి సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన దంతాలకు, చిగుళ్ల పరిరక్షణకు కూడా ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాలను నెయ్యితో కలపడం వల్ల దాని శక్తిరెట్టింపు అవుతుంది.