Akarsh Byramudi: పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు.. ఎట్టకేలకు ఫోటోస్ రివీల్..
బుల్లితెర ప్రేక్షకులకు ఆకాష్ బైరమూడి సుపరిచితమే. తెలుగులో అనేక సీరియల్లలో నటించి మెప్పించాడు. పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్ని పరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని సక్లేష్ పుర ప్రాంతానికి చెందిన ఆకాశ్.. అటు కన్నడ, ఇటు తెలుగు సీరియల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇటీవల ఆకాశ్ పెళ్లి చేసుకున్నట్లు ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ కొన్ని ఫోటోస్ వీడియోస్ రివీల్ చేశారు.