- Telugu News Photo Gallery Cinema photos Nabha Natesh latest sizzling photos goes viral in social media
Nabha Natesh: అందం ఈ ముద్దుగుమ్మను చేరి సోయగాన్ని అప్పు అడుగుతుందేమో.. సిజ్లింగ్ ఫొటోస్ వైరల్..
మోడల్ గా మొదలై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారల్లో నభా నటేష్ కూడా ఒకరు. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. కన్నడలో చిత్రం వజ్రకాయతో పాటు తెలుగులో నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది. ఆమెను "ఇస్మార్ట్ బ్యూటీ" అని పిలుస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ వయ్యారి భామ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. మీరు కూడా వీటిపై ఓ లుక్కెయ్యండి..
Updated on: May 12, 2024 | 9:22 AM

11 డిసెంబర్ 1995న కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లాలోని హిందూ పుణ్య క్షేత్రమైన శృంగేరిలో ఓ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ నాభ నటేష్. ఉడిపిలోని N.M.A.M న్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది.

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడంతో పాటు మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. కొద్దికాలం పాటు భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఆమె పాఠశాల, కళాశాల రోజుల్లో అనేక పోటీలలో భరతనాట్యం చేసింది.

2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు పోటీల్లో టాప్ 11 జాబితాలో భాగంగా మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె అభినయ తరంగ వద్ద నటనలో శిక్షణ పొందింది. అలాగే బెలవాడిలో థియేటర్ కెరీర్ ప్రారంభించింది.

తన 19వ ఏట కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో 2015లో వచ్చిన వజ్రకాయ చిత్రంతో నటనలో తన కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ. ఈ సినిమా కర్ణాటకలో అనేక థియేటర్లలో 100 రోజులకు పైగా సందడి చేసింది. 2017లో లీ, సాహెబా అనే రెండు కన్నడ చిత్రాల్లో కనిపించింది.

2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో కథానాయకిగా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

డిస్కో రాజ, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ మాస్ట్రో వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం డార్లింగ్ వై దిస్ కలవారి అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.




