ఇదో విచిత్ర ప్రేమ కథా చిత్రమ్.. ఆర్మీ సోల్జర్ దెయ్యాన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పిన మహిళ.. ఎక్కడంటే

పోడ్‌కాస్ట్‌లో సంభాషణ సమయంలో రెబెక్కా తన దెయ్యం ప్రేమికుడిని ఎలా కలుసుకుందో చెప్పింది. ఒక రాత్రి రోడ్డుపై ఒంటరిగా ఉన్నాను అప్పుడు తన చుట్టూ ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. కొంచెం సమయం తర్వాత ఎర్రటి కోటు ధరించిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి నిలబడినట్లు అనిపించింది అని వెల్లడించింది. అయితే అప్పుడు ఒంటరిగా ఉండి భయపడితే, ఇంటికి ఆమెతో పాటు తీసుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు పేర్కొంది.

ఇదో విచిత్ర ప్రేమ కథా చిత్రమ్.. ఆర్మీ సోల్జర్ దెయ్యాన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పిన మహిళ.. ఎక్కడంటే
Rebecca Carmichael
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2024 | 4:30 PM

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలియదు ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. నిజ జీవితంలో ప్రేమికులు చెబుతారు. వయసు, ఆస్తులు అంతస్తులు చూడని ప్రేమల గురించి అనేక వార్తలు వింటున్నాం.. తాజాగా ఓ మహిళ తన ప్రేమ గురించి ప్రపంచానికి చెప్పి షాక్ ఇచ్చింది. ఎందుకంటే తాను ఓ దెయ్యంతో చాలా ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతడిని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నానని 33 ఏళ్ల రెబెక్కా అనే అమెరికన్ మహిళ చెప్పింది. ఈ మహిళ వింత ప్రేమ అద్భుతమైన ప్రేమ కథ ఒక రాత్రి ఎర్రటి కోటులో ఉన్న ఈ ఆత్మను కలుసుకున్నప్పుడు మొదలైందని.. తాను అతనితో ప్రేమలో పడడంతో ప్రారంభమైందని పేర్కొంది. అంతేకాదు ఆ స్త్రీ అతన్ని ప్రేమగా రూపర్ట్ అని పిలుస్తుంది.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం, నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్‌కు చెందిన రెబెక్కా కార్మైకేల్ ఒక మహిళతో పాటు దెయ్యంతో కూడా దీర్ఘకాలిక సంబంధంలో ఉంది. ఇది వందల సంవత్సరాల క్రితం మరణించిన వెల్ష్ సైనికుడి ఆత్మ అని వారు చెప్పారు.

పోడ్‌కాస్ట్‌లో సంభాషణ సమయంలో రెబెక్కా తన దెయ్యం ప్రేమికుడిని ఎలా కలుసుకుందో చెప్పింది. ఒక రాత్రి రోడ్డుపై ఒంటరిగా ఉన్నాను అప్పుడు తన చుట్టూ ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. కొంచెం సమయం తర్వాత ఎర్రటి కోటు ధరించిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి నిలబడినట్లు అనిపించింది అని వెల్లడించింది. అయితే అప్పుడు ఒంటరిగా ఉండి భయపడితే, ఇంటికి ఆమెతో పాటు తీసుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అకస్మాత్తుగా అపరిచితుడి నుండి అలాంటి విషయాలు విన్న తర్వాత రెబెక్కా సంకోచించింది. అయితే కానీ ఆమె వెంట వెళ్ళడానికి అంగీకరించింది. రెడ్ కోట్‌లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, వెల్ష్ సైనికుడి దెయ్యం అని రెబెక్కా చెప్పింది. అదే సమయంలో దెయ్యం కూడా తనకు మొదట్లో ఆమె పట్ల ఆసక్తి లేదు.. అయితే ఎప్పుడు సంబంధంలోకి వచ్చానో తనకే తెలియదని అన్నాడట.

వృత్తిరీత్యా దెయ్యం గైడ్ అయిన మహిళ రూపెర్ట్( దెయ్యం మధ్య)తో సంబంధం తన గత జీవితంతో ముడిపడి ఉందని చెప్పారు. మహిళ చెప్పిన ప్రకారం ఇద్దరూ వారి పూర్వ జన్మలలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్నీ రూపర్ట్ తనతో చెప్పాడు. 1781 సంవత్సరంలో రూపర్ట్ 82వ రెజిమెంట్‌లో భాగంగా నార్త్ కరోలినాలో స్థిరపడ్డాడని రెబెక్కా చెప్పింది. ఈ విషయాన్నీ ధృవీకరించడానికి తాను హిప్నాటిస్టులు, మానసిక వైద్యుల సహాయం తీసుకున్నట్లు రెబెక్కా పేర్కోంది.

ఆ దెయ్యం విల్మింగ్టన్ సమీపంలో ఒక కుటుంబంతో నివసిస్తున్నట్లు రెబెక్కాతో చెప్పింది. ఈ సమయంలో అతను మేరీతో స్నేహం చేశాడు. ఆపై వారిద్దరూ వివాహం చేసుకున్నారు. మేరీ చనిపోయిన తర్వాత కూడా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నానని రూపర్ట్ చెప్పారు. అలా అతని ఆత్మ రెబెక్కాలో మేరీని కనుగొంది.

ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పేంత వరకు రూపర్ట్ తన కోసం ఎదురుచూస్తూనే ఉంటాడని ఆ మహిళ చెప్పింది. ప్రస్తుతం రూపర్ట్ ఆమెతో దెయ్యంగా సంతోషంగా సమయాన్ని గడుపుతోంది. ఇద్దరూ కలిసి కేఫ్‌లకు వెళ్తారు. నడుస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కాఫీతో ఆనందిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..