- Telugu News Photo Gallery Spiritual photos Famous tourist places to visit near shirdi in summer season
వేసవిలో షిర్డీ సాయి దర్శనానికి వెళ్తున్నారా… సమీపంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలపై ఓ లుక్ వేయండి..
వేసవి సెలవులతో సాయిబాబా దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు షిర్డీకి చేరుకుంటారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న షిర్డీలో సాయిబాబా తన జీవితాన్ని గడిపారు, అందుకే ఇది ప్రజలకు విశ్వాసంతో ముడిపడి ఉన్న ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఎవరైనా షిర్డీ సాయిని సందర్శించాలని అనుకుంటే.. ఆక్కడికి వెళ్ళిన తర్వాత.. కొన్ని ఇతర ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. షిర్డీ చుట్టుపక్కల కొన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయి, వాటిని సందర్శించడం షిర్డీ యాత్రను చిరస్మరణీయం చేస్తుంది.
Updated on: May 14, 2024 | 4:00 PM

షిర్డీ నుండి కేవలం కొన్ని గంటల ప్రయాణం చేసి తక్కువ దూరంలో ఉన్న ప్రకృతి అందమైన దృశ్యాల మధ్య విశ్రాంతి సమయాన్ని గడపవచ్చు. పర్యాటక యాత్రను ఉత్తేజకరమైనదిగా చేయవచ్చు. కనుక షిర్డీలోని సాయిబాబాను దర్శించుకోవడంతో పాటు ఏ ఇతర ప్రదేశాలను దర్శించుకోవచ్చునో తెలుసుకుందాం..

సాయి హెరిటేజ్ విలేజ్ షిర్డీ సాయికి వెళుతున్నట్లయితే.. సాయిబాబా ఆలయాన్ని సందర్శించడమే కాకుండా సాయి హెరిటేజ్ విలేజ్ కూడా సందర్శించండి. సాయిబాబా జీవితంలో జరిగిన సంఘటనలను తెలిపే అనేక శిల్పాలు ఇక్కడ తయారు చేయబడ్డాయి. భక్తులకు ఈ ప్రదేశం విశ్వాసానికి, ఆకర్షణకు కేంద్రంగా ఉంది.

దీక్షిత్ వాడా మ్యూజియం సాయిబాబా జీవితానికి సంబంధించిన విషయాలను చూడాలనుకుంటే దీక్షిత్ వాడా మ్యూజియంకు వెళ్లవచ్చు. సాయిబాబా పాత ఛాయాచిత్రాలే కాకుండా ఇక్కడ బాబా పాదరక్షలు, వంటపాత్రలు, స్నానపు రాళ్లు, బట్టలు మొదలైన ఎన్నో వస్తువులు ఉన్నాయి.

శని శింగనాపూర్ ఆలయం ప్రసిద్ధ శని శింగనాపూర్ దేవాలయం కూడా షిర్డీకి సమీపంలో ఉంది. సుమారు గంటన్నర ప్రయాణం చేసి చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న శనిదేవుని దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ ఆలయానికి తలుపు లేదు. శనిదేవుడు బహిరంగ ప్రదేశంలో ఆకాశం క్రింద ఉంటాడు. ఈ ఆలయాన్ని ఎప్పుడైనా హాయిగా దర్శించుకోవచ్చు. ఇది శనిశ్వరుడికి చెందిన ప్రసిద్ధ ఆలయం.

సపుతర ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సమయాన్ని గడపాలనుకుంటే షిర్డీకి మూడున్నర గంటల దూరంలో ఉన్న సపుతర హిల్ స్టేషన్‌ని తప్పకుండా సందర్శించండి. ఇక్కడ సూర్యాస్తమయం, సూర్యోదయ దృశ్యం మీ హృదయాన్ని ఆనందపరుస్తుంది. ఈ హిల్ స్టేషన్ ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

కొరోలి కొండ సపుతర వలె, కొరోలి కొండ షిర్డీ నుండి దాదాపు 3 గంటల దూరంలో ఉంది, ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రకృతికి దగ్గరగా ఉంటారు. సాహసాలను ఇష్టపడే వారు అయితే, ఈ ప్రదేశం మీకు సరైనది. ఇక్కడికి వెళ్ళిన వారు ట్రెక్కింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు.





























