- Telugu News Photo Gallery Spiritual photos Travel India: best tourist places to visit near nashik in summer
షిర్డీ వెళ్తున్నారా… నాసిక్ సమ్మర్ లో బెస్ట్ విహార క్షేత్రం.. త్రయంబకం సహా ఉత్తమ పర్యాటక ప్రదేశాలు మీ కోసం
మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ నగరం నాసిక్. పర్యాటకులు సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా నిర్వహిస్తారు. నాసిక్ నగర చరిత్ర రామాయణంతో ముడిపడి ఉందని.. ఇక్కడ అనేక దేవాలయాలు రామాయణంతో ముడిపడి ఉన్నాయని నమ్ముతారు. షిర్డీ, త్రయంబకేశ్వర దేవాలయాలు కూడా నాసిక్ సమీపంలో ఉన్నాయి. అంతేకాదు పర్యాటకులు సందర్శించడానికి కోటలు, జలపాతాలు, అనేక ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఈ నగర చరిత్ర చాలా పురాతనమైనది.
Updated on: May 13, 2024 | 4:22 PM

నాసిక్ ను సందర్శించడానికి వెళ్తే అక్కడ ఉన్న ఇతర అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. షిర్డీ సాయిబాబా దర్శనం కోసం వెళ్ళేవారు.. సమీపంలోని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. జ్యోతిర్లింగ క్షేత్రం నాసిక్ బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న చాలా ప్రదేశాలు చరిత్రతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.

నాసిక్ గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న నగరం. ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. నాసిక్ నగర వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సరంలో ఏ సమయంలోనైనా నగరాన్ని సందర్శించవచ్చు. వర్షాకాలంలో కూడా ప్రజలు సురక్షితంగా ట్రెక్కింగ్‌కు వెళ్లే కొన్ని నగరాల్లో ఇది ఒకటి. నాసిక్‌లో చూడదగ్గ ప్రదేశాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం సహా అనేక పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

అంజనేరి కొండలు త్రయంబకేశ్వర్ నుండి 10 కి.మీ ఎత్తులో ఉంది. ఈ కొండలపై ఆకర్షణీయమైన గుహ ఉంది. అలాగే ఈ గుహ లోపల హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. ఈ ప్రదేశం హనుమంతుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా అంజనీ మాత ఆలయం కూడా ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ యాత్రికులు, ట్రెక్కర్లను చూడవచ్చు. ఈ ఆలయం 4,200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అక్కడికి చేరుకోవడానికి మూడు పర్వతాలు ఎక్కాలి.

రతన్‌వాడి నాసిక్ సమీపంలో ఉంది. ఈ ప్రదేశం అందం చాలా మనోహరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులు సందర్శించడానికి ఉత్తమమైనది. ఈ గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉంది. చుట్టూ ఉన్న పర్వతాలు, పచ్చదనం సహజ దృశ్యాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. జూన్-జూలై సీజన్‌లో కూడా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని పర్యాటకులు చెబుతారు. ఇక్కడ మీరు ఆర్థర్ లేక్, రతన్‌ఘర్ కోట వంటి ప్రదేశాలకు వెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ మీరు ట్రెక్కింగ్, హైకింగ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.

సీతా దేవి గుహ: నాసిక్ సెంట్రల్ బస్టాండ్ నుండి 3 కి.మీ దూరంలో పంచవటి ప్రాంతంలో సీతా దేవి గుహ ఉంది. సీతా దేవి వనవాస సమయంలో కొన్ని రోజులు ఈ గుహలో ఉండేదని ప్రతీతి. ఇక్కడ దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.

సూర్యమల్ హిల్స్ స్టేషన్ ముంబై నుండి సుమారు 143 కి.మీ .. నాసిక్ నుంచి 86 కి.మీ దూరంలో ఉంది. ఇది మహారాష్ట్రలోని ఎత్తైన హిల్ స్టేషన్. ఇక్కడ మీరు పశ్చిమ కనుమల అందమైన దృశ్యాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు దేవబంద్ ఆలయం, అమలా వన్యప్రాణుల అభయారణ్యం కూడా సందర్శించవచ్చు.




