AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నయ్య అవతారం ఖతుశ్యామ్ జీ జయంతి రేపు.. నలుపు రంగులో దర్శనం.. ప్రత్యేక పూజల సమయం ఎప్పుడంటే ..

మే 15 ఖతు శ్యామ్ జీ జన్మదినం. ఈ రోజున బాబా దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ మేరకు ఆలయ కమిటీ వెబ్‌సైట్‌లో లేఖ విడుదల చేసి భక్తులకు సమాచారం అందించింది. ప్రత్యేక పూజలు, ప్రత్యెక కార్యక్రమాల కారణంగా ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. అందుకే భక్తులు కొన్ని గంటల పాటు బాబా దర్శనం చేసుకోలేరని ఆ లేఖలో భక్తులకు విజ్ఞప్తి చేసింది.

కన్నయ్య అవతారం ఖతుశ్యామ్ జీ జయంతి రేపు.. నలుపు రంగులో దర్శనం.. ప్రత్యేక పూజల సమయం ఎప్పుడంటే ..
Khatushyamji Temple
Surya Kala
|

Updated on: May 14, 2024 | 3:17 PM

Share

ఖతుశ్యామ్ జీని కలియుగంలో శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో శ్రీ ఖతు శ్యామ్ జీ గొప్ప ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాత ఖతు శ్యామ్ జీ భక్తుల కోసం ఆలయ సిబ్బంది ఒక విజ్ఞప్తిని చేసింది.

సమాచార లేఖను జారీ చేసిన ఆలయ కమిటీ మే 15 ఖతు శ్యామ్ జీ జన్మదినం. ఈ రోజున బాబా దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ మేరకు ఆలయ కమిటీ వెబ్‌సైట్‌లో లేఖ విడుదల చేసి భక్తులకు సమాచారం అందించింది. ప్రత్యేక పూజలు, ప్రత్యెక కార్యక్రమాల కారణంగా ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. అందుకే భక్తులు కొన్ని గంటల పాటు బాబా దర్శనం చేసుకోలేరని ఆ లేఖలో భక్తులకు విజ్ఞప్తి చేసింది.

ఎప్పుడు, ఎన్ని గంటలు తలుపులు మూసివేయనున్నారంటే ఖతు శ్యామ్ జీ తిలకం ప్రత్యేక పూజల నిమిత్తం మే 14వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మే 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బాబా శ్యాం గర్భగుడి తలుపులు మూసి ఉంచాలని కమిటీ జారీ చేసిన లేఖలో పేర్కొంది. బాబా శ్యామ్ ఆలయ తలుపులు మే 15 సాయంత్రం 5 గంటలకు మంగళ హారతి సమయంలో తెరవబడతాయి. అమావాస్య తర్వాత శ్రీ శ్యాం ప్రభువుకు ప్రత్యేక పూజలు, అలంకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 15 గంటలకు పైగా సమయం పడుతుంది.

ఖతు శ్యామ్ జీ ఆరతి సమయం ఆలయంలో బాబా ఖాతు శ్యామ్ జీ హారతి సమయం శీతాకాలం, వేసవి కాలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. శీతాకాలంలో మంగళ ఆరతి ఉదయం 5.30 గంటలకు, శృంగార ఆరతి ఉదయం 8 గంటలకు భోగ్ ఆరతి మధ్యాహ్నం 12.30 గంటలకు ఇవ్వనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు సాయంత్రం హారతి, రాత్రి 9 గంటలకు శయన హారతి నిర్వహిస్తారు. వేసవిలో మంగళ హారతి సాయంత్రం 4.30, శృంగార ఆరతి ఉదయం 7, భోగ్ ఆరతి మధ్యాహ్నం 12.30. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు సాయంత్రం హారతి, రాత్రి 10 గంటలకు శయన హారతిని ఇస్తారు.

బాబా నలుపు రంగులో దర్శనం ఖతు శ్యామ్ జీ తన భక్తులకు రెండు రూపాలలో దర్శనం ఇస్తారు, ఇందులో బాబా శ్యామ్ కృష్ణ పక్షంలో ముదురు రంగులో … శుక్ల పక్షంలో పూర్తి శాలిగ్రామంలో అతని అసలు రూపంలో కనిపిస్తారు. ఈ రోజున శుక్ల పక్షం ముగింపు తేదీ కాబట్టి బాబా ముదురు రంగులో కనిపిస్తారు. బాబా ప్రత్యేక పూజ, తిలకం అలంకారానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత బాబా శ్యామ్‌ను తిలకం రూపంలో నుదుటి నుండి బుగ్గల వరకు గంధం పూస్తారు. అమావాస్య రోజున బాబాకు వివిధ రకాల ద్రవాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత బాబా భక్తులకు నలుపు రంగులో దర్శనమిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు