రాశిని మార్చుకున్న సూర్యుడు.. ఈ రాశులవారికి నెల రోజుల పాటు లాభాలే లాభాలు!
ఈ రోజు సాయంత్రం సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ రాశిలో సూర్యుడు నెల రోజులు ఉంటాడు. దీంతో ఈ నెల రోజులు కొన్ని రాశులకు చెందిన వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ముఖ్యంగా ఏడు రాశులకు అదృష్టాన్ని కలగజేయనుంది సూర్యుడి సంచారం. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
నవ గ్రహాల అధినేత సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి నెల రోజులు తీసుకుంటాడు. ఇలా సూర్యుడు సంచరించడాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సంక్రాంతి అని అంటారు. ఈ రోజు సాయంత్రం సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ రాశిలో సూర్యుడు నెల రోజులు ఉంటాడు. దీంతో ఈ నెల రోజులు కొన్ని రాశులకు చెందిన వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ముఖ్యంగా ఏడు రాశులకు అదృష్టాన్ని కలగజేయనుంది సూర్యుడి సంచారం. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేషరాశి: సూర్యుడు వృషభ రాశిలోకి అడుగు పెడుతూ ఈ మేష రాశివారి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. పిల్లల చదువు చక్కగా సాగుతుంది. వ్యాపారస్థులకు ఎప్పటి నుంచో పరిష్కారం కాని కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్ధికంగా లాభాలను పొందుతారు. సంపదలో భారీ మార్పులు వస్తాయి. అయితే మేషరాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు సంతోషంగా ఉంటారు. వాహన కొనుగోలు ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పరిష్కరం అవుతాయి. మొత్తానికి ఈ నెల రోజులు సంతోషంగా, సుఖంగా సాగుతుంది ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితం.
మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడి సంచారంతో పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అంతేకాదు పలు విధాలుగా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. అయితే స్వీయ నియంత్రణ లేకపోతె అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. పూర్తి విశ్వాసం పెరిగి చేపట్టిన పనులు పూర్తీ చేస్తారు. శ్రమ రెట్టింపు అవుతుంది.
కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడి సంచారంతో అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక, శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు విధుల్లో పురోగతి ఉంటుంది.
తులారాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడి సంచారం వలన పలు విధాల ప్రయోజనాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలను చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఖర్చులను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు