Malavya Yoga: స్వస్థానంలోకి శుక్ర గ్రహ సంచారం.. మాలవ్య యోగంతో ఆ రాశుల వారికి సిరి సంపదలు..!

ఈ నెల 19న వృషభ రాశిలో ప్రవేశించబోతున్న శుక్ర గ్రహంతో కొన్నిరాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న అయిదు మహా పురుష యోగాల్లో ఇదొకటి. ఏదైనా రాశికి కేంద్రంలో, అంటే 1,4,7,10 స్థానాల్లో, శుక్రుడు ఉచ్ఛ, స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. ఈ యోగం జూన్ 12వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ మాలవ్య మహా యోగం పట్టిన వ్యక్తులు ప్రముఖుల స్థాయికి చేరుకుంటారు.

Malavya Yoga: స్వస్థానంలోకి శుక్ర గ్రహ సంచారం.. మాలవ్య యోగంతో ఆ రాశుల వారికి సిరి సంపదలు..!
Malavya Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 13, 2024 | 5:03 PM

ఈ నెల 19న వృషభ రాశిలో ప్రవేశించబోతున్న శుక్ర గ్రహంతో కొన్నిరాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న అయిదు మహా పురుష యోగాల్లో ఇదొకటి. ఏదైనా రాశికి కేంద్రంలో, అంటే 1,4,7,10 స్థానాల్లో, శుక్రుడు ఉచ్ఛ, స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. ఈ యోగం జూన్ 12వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ మాలవ్య మహా యోగం పట్టిన వ్యక్తులు ప్రముఖుల స్థాయికి చేరుకుంటారు. రాజకీయంగా ప్రాధాన్యం పెరుగు తుంది. అసాధారణ రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. ప్రస్తుతం ఈ యోగం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు పడుతున్నప్పటికీ, మేష, కన్యా రాశులకు కూడా ఆర్థికపరంగా ఉన్నత స్థాయిని కలిగించే అవకాశముంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో, స్వస్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల ఆర్థికంగా కలలో కూడా ఊహించని అదృష్టం పడుతుంది. అనేక మార్గాల్లో ఆస్తి, ఆదాయం కలిసి వస్తాయి. మాటకు బాగా విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో వైభవం పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ యోగం వల్ల పట్టపగ్గాలు ఉండవు. ఊహించని విధంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు, స్థిరత్వం లభి స్తుంది. జీతభత్యాలు, ఆదాయం పెరిగి ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. మనసులోని కోరి కలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో భాగ్య యోగాలు పడతాయి.
  3. సింహం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు లభిస్తాయి. సర్వత్రా ప్రాధాన్యం పెరుగు తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. రాజకీయ ప్రాబల్యానికి కూడా అవకాశం ఉంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనారోగ్యాల నుంచి దాదాపు పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలుగా భాగ్యం వృద్ధి చెందుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. విదేశీ యానానికి, విదేశాల్లో స్థిర త్వానికి అవకాశముంది. పితృమూలక ధన ప్రాప్తి సూచనలున్నాయి. తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశముంది. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో పొర పచ్చాలు సమసిపోయి సఖ్యత పెరిగే సూచనలున్నాయి. సంపద బాగా పెరిగే అవకాశముంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఆర్థికపరంగా జీవితం సమూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. సాధా రణ స్థితిలో ఉన్నవారైనా ఉచ్ఛస్థితికి ఎదగడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబం ధం కుదురుతుంది. సంపన్న లేక పలుకుబడి గత వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. విలాస జీవితం అలవడుతుంది. ఇతరులకు సహాయపడడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల మాలవ మహా పురుష యోగంతో పాటు దిగ్బల యోగం ఏర్పడింది. ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు, లాభాల పరంగా బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. మాతృమూలక ధన లాభముం టుంది. గృహ, వాహన యోగాలకు అవకాశముంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.