Horoscope Today: ఆ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..

దిన ఫలాలు (మే 14, 2024): మేష రాశి వారు ఈ రోజు కొత్త పనులు, కొత్త ప్రయత్నాలు చేపట్టేందుకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి వారు వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ముందుకు దూసుకుపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..
Horoscope Today 12th May 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 14, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మే 14, 2024): మేష రాశి వారు ఈ రోజు కొత్త పనులు, కొత్త ప్రయత్నాలు చేపట్టేందుకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి వారు వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ముందుకు దూసుకుపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొత్త పనులు, కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వీలైనంత సద్విని యోగం చేసుకోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయ వృద్ధికి అవ కాశముంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రము ఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం నుంచి ఆశించిన సహకారం అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధువుల విషయాల్లో కల్పించుకోకపో వడం మంచిది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పిల్లలు చదువులు, పోటీ పరీక్షల్లో ముందుం టారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలలో నిమ గ్నం అవుతారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఢోకా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యయ ప్రయాసలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. వాహన యోగం ఉంది. ఉద్యోగంలో ప్రాధా న్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత పనుల మీద దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. శుభ కార్యాలకు సహాయం చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయి, ఊరట లభిస్తుంది. పెళ్లి ప్రయత్నా లకు సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలుం టాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశముంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవు తాయి. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్య కారణంగా బాగా ఇబ్బంది పడతారు. ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలని స్తాయి. అనవసర ఖర్చులకు పగ్గాలు వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మంచి ఆఫర్లు అంది వస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి ఎవ రికీ హామీలు ఉండవద్దు. వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అవనసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు పండిస్తాయి. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అను కూలంగా మారుతాయి. మిత్రుల నుంచి ఊహించని సహాయాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రతి పనీ పూర్తవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. అనవ సర ఖర్చులు పెరుగుతాయి. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగి విశ్రాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక శుభ కార్యంలో చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల పరంగా పురోగతి చెందు తాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు చిన్నా చితకా సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరు ద్యోగులకు తప్పకుండా శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం