Lucky Horoscope: మేష రాశిలో శుక్ర, బుధ సంచారం.. ఆ రాశులకు అదృష్ట యోగాలు..!

ఈ నెల 14 నుంచి మేష రాశిలో శుక్ర, బుధులు మాత్రమే సంచారం చేయడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడాన్ని ధన లక్ష్మీ యోగంగా పరిగణించడం జరుగుతుంది. ఇవి రెండూ శుభ గ్రహాలైనందువల్ల తప్పకుండా వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను బాగా మెరుగుపరిచే అవకాశ ముంటుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల నాలుగు చర రాశులు..

Lucky Horoscope: మేష రాశిలో శుక్ర, బుధ సంచారం.. ఆ రాశులకు అదృష్ట యోగాలు..!
Lucky Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 13, 2024 | 4:49 PM

Lucky Yogas: ఈ నెల 14 నుంచి మేష రాశిలో శుక్ర, బుధులు మాత్రమే సంచారం చేయడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడాన్ని ధన లక్ష్మీ యోగంగా పరిగణించడం జరుగుతుంది. ఇవి రెండూ శుభ గ్రహాలైనందువల్ల తప్పకుండా వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను బాగా మెరుగుపరిచే అవకాశ ముంటుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల నాలుగు చర రాశులు, రెండు ద్విస్వభావ రాశులు ఎంతగానో లభ్ధి చెందడం జరుగుతుంది. ఇందులో మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు కాగా, మిథునం, మీనం ద్విస్వభావ రాశులు.

  1. మేషం: ఈ రాశిలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఈ రాశికి ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి, అభివృద్ధి ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో మంచి గుర్తింపు ఏర్పడడంతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇబ్బడిముబ్బడిగా ఆర్థికలాభం ఉంటుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది.
  2. మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. జీత భత్యాలు, అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరిగే సూచనలున్నాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం, సంతాన యోగం కలగడం వంటివి జరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులు తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగంలో చేరతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, బుధులు చేరడం శుభ సూచకం. వృత్తి, ఉద్యోగాలపరంగా ఏ ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలనిస్తుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడడం జరుగు తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవ కాశాలు అంది వస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  4. తుల: ఈ రాశికి సప్తమంలో శుక్ర, బుధుల సంచారం వల్ల అనేక విధాలుగా హోదా, స్థాయి పెరిగే అవ కాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. సాధారణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నవారు కార్పొ రేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకునే అవకాశముంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  5. మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖసంతోషాలకు సంబంధించిన స్థానంలో, రెండు శుభ గ్రహాల సంచారం వల్ల అనేక విధాలుగా సుఖ సంతోషాలలో గడిపే అవకాశం ఉంది. సొంత ఇల్లు ఏర్పడుతుంది. వాహన యోగం కలుగుతుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. మాతృమూలక ధన లాభం ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనూ, సామాజికంగానూ ప్రాభవం పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక మార్గాల్లో ధన లాభం కలుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. స్త్రీ మూలక ధన లాభానికి కూడా అవకాశముంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..