AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగలకే దొంగ.. 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించాడు.. కట్ చేస్తే.. అసలు సంగతి ఇది..!

ఢిల్లీ నుంచి అమృత్‌స‌ర్, హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ విమానాల్లో ప్ర‌యాణించిన వారిని ప‌రిశీలించ‌గా, ఒక వ్య‌క్తి రెండు విమానాల్లో ప్ర‌యాణిస్తూ అనుమానాస్ప‌దంగా క‌నిపించాడు. దీంతో ఆ అనుమానాస్ప‌ద వ్య‌క్తి ఫోన్ నంబ‌ర్‌ ఆధారంగా అత‌న్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో అతన్ని విచారించగా మొత్తం విషయాలు బయటపడ్డాయి.

దొంగలకే దొంగ.. 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించాడు.. కట్ చేస్తే.. అసలు సంగతి ఇది..!
Flight Journey
Jyothi Gadda
|

Updated on: May 14, 2024 | 3:43 PM

Share

ప్రయాణాల్లో నగలు, నగదు చోరీకి గురికావటం మనం తరచూగా చూస్తుంటాం. వింటుంటాం. అయితే, బస్సులు, రైళ్లు వంటి రద్దీగా ఉండే వాహనాల్లో ఇలాంటి దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ, మీరెప్పుడైనా విమానంలో దొంగతనాల గురించి విన్నారా..? అవును, మీరు విన్నది నిజమే.. విమానంలో చోరీలు. ఎయిరిండియా విమానాల్లో నిత్యం దొంగతనాలు జరుగుతున్నట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. తాజాగా అమెరికా వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద కూడా నగలు చోరీకి గురికావటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారించిన పోలీసులకు ఊహించని షాక్‌ తగిలినంత పనైంది. ఏడాది కాలంగా ఒక వ్యక్తి విమానాల్లో ప్రయాణిస్తూ విలువైన ఆభరణాలు, నగదు దొంగతనం చేస్తున్నాడని గుర్తించారు. అతడు ఏకంగా సంవత్సరంలో 110 రోజుల‌కు పైగా 200 విమానాల్లో ప్ర‌యాణించి ప్రయాణికులను దోచుకున్నాడని తెలిసింది.

ఏప్రిల్ 11వ తేదీన విమానంలో ఓ ప్రయాణికురాలి వద్ద ఉన్న రూ. 7 ల‌క్షలు విలువ చేసే ఆభ‌ర‌ణాలు పోయాయంటూ బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధిత మ‌హిళ‌ హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణించారు. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన మ‌రో ప్రయాణికుల వద్ద రూ. 20 ల‌క్ష‌ల విలువ చేసే నగలు, ఇత‌ర వ‌స్తువులు చోరీకి గురైనట్టు కంప్లైట్‌ వచ్చింది. ఇత‌ను అమృత్‌స‌ర్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణించాడు. బాధిత ప్ర‌యాణికుడు కూడా పోలీసుల‌కు పిర్యాదు చేశాడు. ఇలాంటి కేసులు వరుసగా నమోదు కావటంతో పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. వెంటనే ఢిల్లీ, అమృత్‌స‌ర్, హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. ఢిల్లీ నుంచి అమృత్‌స‌ర్, హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ విమానాల్లో ప్ర‌యాణించిన వారిని ప‌రిశీలించ‌గా, ఒక వ్య‌క్తి రెండు విమానాల్లో ప్ర‌యాణిస్తూ అనుమానాస్ప‌దంగా క‌నిపించాడు. దీంతో ఆ అనుమానాస్ప‌ద వ్య‌క్తి ఫోన్ నంబ‌ర్‌ ఆధారంగా అత‌న్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో అతన్ని విచారించగా మొత్తం విషయాలు బయటపడ్డాయి.

విమానాల్లో దర్జాగా దోచుకుంటున్న వ్యక్తి 40 ఏళ్ల రాజేష్ కపూర్‌గా గుర్తించారు. అయితే, ఎయిర్‌పోర్టుల్లో తిరుగుతూ వృద్ధుల‌ను టార్గెట్ చేసేవాడు. వారితో మాట మాట కలుపుతూ వారి ల‌గేజీలో ఏయే వ‌స్తువులు ఉన్నాయో ఆరా తీసేవాడు. ఆ త‌ర్వాత విమానంలో వారి పక్క సీటులోనే కూర్చునేందుకు సిబ్బందిని ఒప్పించేవారు. ఆ తర్వాత మెల్ల‌గా వారి బ్యాగుల్లోని విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దును కొట్టేసేవాడని పోలీసులు తేల్చారు. రాజేష్‌ కపూర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. మరికొన్ని వస్తువులను అమ్మేసినట్టుగా తేల్చిన పోలీసులు వివరాలు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us