AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మేఘాలలో తేలిపొమ్మన్నది.. అంటూ బైక్‌ రైడ్ ఎంజాయ్‌ చేస్తున్న ఎలుగుబంటి.. ! చూస్తే అవాక్కే..!!

వారి పక్కనే ఉన్న సైడ్ కార్ సీటులో ఎలుగుబంటిని కూర్చుబెట్టుకుని వెళ్తున్నారు. బైక్ వేగంగా వెళ్తుంటే.. ఆ ఎలుగుబంటి ఎంజాయ్ చేస్తున్నట్టుగా గాల్లోకి చేతులు లేపుతోంది. అది అలా జాలిగా రైడ్ ఎంజాయ్ చేస్తుంటే.. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి దానికి ఏదో తినిపిస్తున్నాడు.. ఈ 15 సెకన్ల నిడివి గల ఈ చిన్న క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Watch Video: మేఘాలలో తేలిపొమ్మన్నది.. అంటూ బైక్‌ రైడ్ ఎంజాయ్‌ చేస్తున్న ఎలుగుబంటి.. ! చూస్తే అవాక్కే..!!
Bear On Bike
Jyothi Gadda
|

Updated on: May 14, 2024 | 6:21 PM

Share

చాలా మంది తమ ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు జంతువులను తమతో పాటు బైక్‌, కార్లలో తీసుకువెళ్లటం చూస్తుంటాం. అయితే, మీరు ఎప్పుడైనా బైక్‌పై ప్రయాణిస్తున్న ఎలుగుబంటిని చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి బైక్‌పై సైడ్‌కార్‌లో 113 కిలోల బరువున్న ఎలుగుబంటిని తీసుకొని సిటీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. అటుగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ఇదంతా వీడియో తీశాడు. కాకపోతే, ఇది మరెక్కడో కాదు.. రష్యాలోని అర్ఖంగెల్స్క్ లో అని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ ప్రజల హృదయాలను గెలుచుకుంది.

వైరల్ వీడియోలో ఒక బైక్ పై ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి పక్కనే ఉన్న సైడ్ కార్ సీటులో ఎలుగుబంటిని కూర్చుబెట్టుకుని వెళ్తున్నారు. బైక్ వేగంగా వెళ్తుంటే.. ఆ ఎలుగుబంటి ఎంజాయ్ చేస్తున్నట్టుగా గాల్లోకి చేతులు లేపుతోంది. అది అలా జాలిగా రైడ్ ఎంజాయ్ చేస్తుంటే.. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి దానికి ఏదో తినిపిస్తున్నాడు.. ఈ 15 సెకన్ల నిడివి గల ఈ చిన్న క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ఈ వీడియోకు సంబంధించి సరైనా ఆధారాలపై స్పష్టత లేదు. అయితే షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోని 1.18 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్ సోషల్ మీడియా వినియోగదారులను షాక్‌ గురి చేసింది. ఎందుకంటే ఈ అడవి జంతువు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మాంసాహారులలో ఒకటి. అయినప్పటికీ, రష్యాలో ప్రజలు ఎలుగుబంట్లను ఇతర పెంపుడు జంతువుల మాదిరిగానే చూస్తారు. గతంలో కూడా ఇలాంటి వీడియోనే కనిపించింది. అప్పట్లో ఒక వ్యక్తి తన చేతులతో ఎలుగుబంటికి లాలీపాప్‌లు తినిపిస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

రష్యాలోనే ఓ వ్యక్తి అడవి ఎలుగుబంటిని తన పెంపుడు జంతువుగా చేసుకున్నాడు. ఎలుగుబంటి యజమాని తన పెంపుడు ఎలుగుబంటికి మౌత్ ఆర్గాన్ వాయించడం నేర్పుతున్నప్పుడు ఆ ఎలుగుబంటి వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ రెండు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా, కోట్లాది మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్