AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదికదా నిజమైన సామజిక సేవ..! దివ్యాంగుడిని వ్యాపారవేత్తగా మార్చిన యువకుడు.. వీడియో వైరల్

పేద, నిరాశ్రయులైన ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఆహారం ఇస్తారు. బాధితులకు ఆశ్రయం కూడా కల్పిస్తారు. అయితే కొన్నిసార్లు నిరాశ్రయులైన, పేద ప్రజల జీవితం మెరుగుపడే విధంగా వారికి సహాయం చేసే ప్రయత్నం కొంతమంది మాత్రమే చేస్తారు. ఇలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రజల హృదయాలు సంతోషించడమే కాదు కొంతమంది భావోద్వేగానికి కూడా గురయ్యారు.

ఇదికదా నిజమైన సామజిక సేవ..! దివ్యాంగుడిని వ్యాపారవేత్తగా మార్చిన యువకుడు.. వీడియో వైరల్
Humanity Video ViralImage Credit source: Twitter/@MyWishIsUs)
Surya Kala
|

Updated on: May 14, 2024 | 8:36 PM

Share

ఆకలి అన్నవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చడం గొప్ప పనే.. ఇది మానవత్వం ఉన్న వారు చేసే పనే.. అయితే ఆ ఆకలిని తీర్చుకునే మార్గాన్ని చూపించిన వాడు దేవుడితో సమానం అంటారు పెద్దలు. అవును సామాజిక సేవకే తమ జీవితాన్ని అంకితం చేసిన వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. పేద, నిరాశ్రయులైన ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఆహారం ఇస్తారు. బాధితులకు ఆశ్రయం కూడా కల్పిస్తారు. అయితే కొన్నిసార్లు నిరాశ్రయులైన, పేద ప్రజల జీవితం మెరుగుపడే విధంగా వారికి సహాయం చేసే ప్రయత్నం కొంతమంది మాత్రమే చేస్తారు. ఇలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రజల హృదయాలు సంతోషించడమే కాదు కొంతమంది భావోద్వేగానికి కూడా గురయ్యారు.

వాస్తవానికి ఈ వీడియోలో ఒక యువకుడు సామాజిక సేవకు నిజమైన అర్ధాన్ని చూపించాడు. సాధారణంగా ఎవరైనా రోడ్డుపక్కన అడుక్కుంటే 5-10 రూపాయలు ఇచ్చి వెళ్లిపోతారు. లేదా తినడానికి ఏదైనా ఆహారాన్ని అందిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక కాళ్లు సరిగ్గా లేని ఒక దివ్యాంగుడు రోడ్డు మీద తన చేతుల మీదుగా ఎక్కడికో వెళ్తున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు అతనిని ఎత్తుకుని ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు. గడ్డం గీసి జుట్టు కట్ చేశాడు. అనంతరం అతనికి స్నానం చేయించి కొత్త బట్టలను ధరింపజేశాడు. బొట్టు పెట్టి అతనికి ఒక వీల్‌చైర్‌ ఉన్న హ్యాండ్‌సైకిల్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ వీల్‌చైర్‌పై కొన్ని చిప్స్, కుర్ కురే ప్యాకెట్లు, కొన్ని సీలు చేసిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ సామాజిక కార్యకర్త వికలాంగుడిని వ్యాపారవేత్తగా చేసి, తన ఖర్చులు తానే సంపాదించుకునే చేశాడు. ఇప్పుడు ఆ దివ్యాంగుడు ఎవరిని డబ్బు అడగాల్సిన పనిలేదు.

వీడియో చూడండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @MyWishIsUs పేరుతో IDతో షేర్ చేయబడింది. ‘ఈ వీడియో This video made my day అనే శీర్షికతో షేర్ చేశారు. ఒక నిమిషం 8 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 57 వేలకు పైగా వీక్షించగా, 2 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు వివిధ రకాల ప్రతిచర్యలను కూడా ఇచ్చారు. ‘మానవత్వం ఇంకా బతికే ఉంది’ అని ఒక వినియోగదారు రాస్తే, ‘ఈ సోదరుడు హృదయాలను గెలుచుకున్నాడు’ అని మరొక వినియోగదారు రాశారు. అయితే, వికలాంగుడిని రోడ్డుపై స్నానం చేయించినందుకు సోషల్ వర్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..