Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి గాయాలు

తొలకరి జల్లులు వేసవి తాపానికి కాస్త ఊరక కలిగించినా.. అక్కడక్కడా అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల ధాటికి చేతికొచ్చిన పంట తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. త్రిపురారం మండలం నీలాయగూడెంలో మంగళవారం పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు..

Cricket: క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Lightning Strikes Youth To Death
Follow us
Srilakshmi C

|

Updated on: May 15, 2024 | 8:54 AM

నల్లగొండ, మే 15: తొలకరి జల్లులు వేసవి తాపానికి కాస్త ఊరక కలిగించినా.. అక్కడక్కడా అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల ధాటికి చేతికొచ్చిన పంట తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. త్రిపురారం మండలం నీలాయగూడెంలో మంగళవారం పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వీరంతా మంగళవారం క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో అందరూ పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అయితే అదే సమయంలో పిడుగుపడి పడటంతో చెట్టు కింద ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటన: తల్లికి మందులు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

అనారోగ్యంతో ఉన్న తన తల్లి మందులు తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్‌నగర్‌ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు.. చేర్యాల మండలం ఆకునూరుకి చెందిన మహ్మద్‌ యాకూబ్‌పాషా (29) లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాకూబ్‌పాషా భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం స్థానికంగా ఓటేసిన యాకూబ్‌పాషా.. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో అనారోగ్యంతో ఉన్న తల్లికి మందుల కోసం బైక్‌పై చేర్యాలకు వచ్చాడు. అయితే అక్కడ షాప్‌ మూసి ఉండటంతో అక్కడి నుంచి సిద్దిపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో నిర్మాణంలో ఉన్న వంతెన కాంక్రీటు గద్దెకు ఢీకొన్నాడు.

దీంతో తలకు తీవ్రగాయమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పైగా అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. తెల్లవారుజామున కూలీలు పనులకు వెళ్లేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు పనుల్లో గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మాణ పనులు జరిగేటప్పుడు హెచ్చరిక బోర్డులు పెట్టలేదని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.