TS Dost 2024: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్‌.. ‘దోస్త్‌’ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు!

తెలంగాణ దోస్త్‌ 2024 నోటిఫికేషన్‌ ఈ నెల 3న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మే 6 నుంచి ప్రారంభంకాగా మే 25వ తేదీతో ముగుస్తుంది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)లో మే 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి సూచించారు..

TS Dost 2024: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్‌.. 'దోస్త్‌' షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు!
TS Dost 2024
Follow us
Srilakshmi C

|

Updated on: May 15, 2024 | 9:31 AM

హైదరాబాద్‌, మే 15: తెలంగాణ దోస్త్‌ 2024 నోటిఫికేషన్‌ ఈ నెల 3న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మే 6 నుంచి ప్రారంభంకాగా మే 25వ తేదీతో ముగుస్తుంది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)లో మే 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి సూచించారు. మే 30 వరకు గడువు ఉంటుందని తెలిపారు.

తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించినప్పటికీ..విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల వినతి మేరకు ఆ తేదీల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. దోస్త్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న విషయం తెలిసిందే.

బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ గ్రాండ్‌ టెస్టులు

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో పలు పోటీ పరీక్షలకు గ్రాండ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌, యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల కోసం ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ గ్రాండ్‌ టెస్టులను నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకనటలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్‌ 1 ఆఫ్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులను మే 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్‌ 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ గ్రాండ్‌ టెస్టులు హైదరాబాద్‌, సైదాబాద్‌లలో మే 23, 26, 28, 30, జూన్‌ 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.