Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class State 1st Ranker: టెన్త్‌లో 625కి 625 మార్కులు.. అంకితకు రూ.5 లక్షల ప్రోత్సాహకం అందజేసిన డిప్యూటీ సీఎం!

కర్ణాటకలో ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అసమాన ప్రతిభ చాటిన బాగల్‌కోట్ జిల్లా ముధోల్ తాలూకాకు చెందిన అంకితను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సన్మానించారు. అంకితకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ పదో తరగతి పరీక్షల్లో 625/625 మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో మెరిసిన అంకిత బసప్పను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు..

10th Class State 1st Ranker: టెన్త్‌లో 625కి 625 మార్కులు.. అంకితకు రూ.5 లక్షల ప్రోత్సాహకం అందజేసిన డిప్యూటీ సీఎం!
10th Class State Rankers
Srilakshmi C
|

Updated on: May 15, 2024 | 7:55 AM

Share

బెంగళూరు, మే 15: కర్ణాటకలో ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అసమాన ప్రతిభ చాటిన బాగల్‌కోట్ జిల్లా ముధోల్ తాలూకాకు చెందిన అంకితను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సన్మానించారు. అంకితకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ పదో తరగతి పరీక్షల్లో 625/625 మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో మెరిసిన అంకిత బసప్పను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. బెంగళూరులోని అంకిత తల్లిదండ్రులను ఆయన మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా బాలికకు రూ.5 లక్షల చెక్కును బహుమతిగా అందజేసి ప్రోత్సహించారు. అలాగే రాష్ట్ర రెండో ర్యాంకర్‌ మాండ్యకు చెందిన నవనీత్‌ అనే బాలుడిని కూడా సన్మానించి రూ.2 లక్షల చెక్‌ అందజేశారు.

అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బాగల్‌కోట్‌లోని మొరార్జీ దేశాయ్ పాఠశాల 625కి 625 మార్కులు సాధించడం మన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన అంకితకి ఫోన్ చేసి అభినందించాను. ప్రభుత్వం తరపున ఈ బాలికను, ఆమె తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. బాలిక తదుపరి చదువు కోసం రూ. 5 లక్షలు బహుమతిగా ఇస్తున్నాను. మండ్యకు చెందిన నవనీత్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అతనికి రూ.2 లక్షలు బహుమతిగా ఇస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆయన అంకిత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. మిగతా పిల్లలు కూడా ఇలాగే చదివి తమ పాఠశాలలకు, గురువులు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా డీకే శివకుమార్‌ సూచించారు. పదో తరగతి ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించిన అంకితను సీఎం సిద్ధరామయ్య సైతం ప్రశంసించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.