AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIIT: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక..

ఒక్కో సెంటర్‌లో 1,000 సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా జూన్‌ 25వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. వీటిలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్‌ అమలు చేస్తారు..

IIIT: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక..
Iiit Admission 2024
Narender Vaitla
|

Updated on: May 16, 2024 | 10:48 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఆరేళ్ల బీటెక్‌ సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఒక్కో సెంటర్‌లో 1,000 సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా జూన్‌ 25వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. వీటిలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్‌ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, ఎన్‌సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5%, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా కింద 0.5% రిజర్వేషన్‌క కల్పిస్తారు. అలాగే ప్రతీ కేటగిరీలోనూ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.

ఈ సీట్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024లో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఇక విద్యార్థులను పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు, మున్సిపల్‌ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డిప్రెవేషన్‌ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. 85% సీట్లను స్థానికం గాను, మిగిలిన 15% సీట్లను మెరిట్‌ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?