AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malkajgiri Corporator Arrest: నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. 2 గంటలపాటు హైడ్రామా!

మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌తె సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ కావడంతో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా..

Malkajgiri Corporator Arrest: నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. 2 గంటలపాటు హైడ్రామా!
Malkajgiri Corporator Arrest
Srilakshmi C
|

Updated on: May 17, 2024 | 7:56 AM

Share

హైదరాబాద్‌, మే 17: మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌తె సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ కావడంతో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా మారింది. తొలుత కిడ్నాప్‌ చేసినట్లు ప్రచారం జరగగా.. ఆ తర్వాత తామే అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు ధృవీకరించారు. అసలేం జరిగిందంటే..

గత సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బహదూర్‌పురలో రిగ్గింగ్‌ జరుగుతోందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌, నాంపల్లి వాసి మహ్మద్‌ బిన్‌ అలీ, చాదర్‌ఘాట్‌కు చెందిన కాశీ, ముషీరాబాద్‌కు చెందిన మితిలేష్‌ వీడియో వైరల్‌ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే దీనిని 2022లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా బహదూర్‌పుర అనే ప్రాంతంలో జరిగిన రిగ్గింగ్‌కు సంబంధించిన పాత వీడియోగా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో గురువారం సాయంత్రం సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌ సమీపంలోని తన కార్యాలయంలో ఉన్న శ్రవణ్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. మిగిలిన వారిని కూడా వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకూ సమాచారం ఇవ్వలేదు. దీంతో కిడ్నాప్‌ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో దాదాపు 2 గంటలపాటు మల్కాజ్‌గిరిలో హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆరా తీసినా ఎలాంటి సమాచారం అందలేదు.

శ్రవణ్‌ కార్యాలయం సమీపంలోని సీసీ పుటేజీలను గమనించగా.. వచ్చిన వారు మఫ్టీలో ఉన్న పోలీసులుగా గుర్తించారు. అయితే తన కుమారుడు శ్రవణ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆయన తండ్రి రాంబాబు మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు శ్రవణ్‌తో సహా నలుగురి అరెస్టు చేసినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు ధ్రువీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.