TSMS 2024 Admissions: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు.. పదో తరగతి మెరిట్‌తో సీట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీగా మే 25ని నిర్ణయించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..
హైదరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీగా మే 25ని నిర్ణయించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు పొందిన విద్యార్ధులకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రతి పాఠశాలలో 160 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, బాలికలు, ఈడబ్ల్యూఎస్, ఓసీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 26న ప్రకటిస్తారు. మే 27 నుంచి 31 వరకు ధ్రువపత్రాలను సమర్పించవల్సి ఉంటుంది. తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయి.
తెలంగాణ ‘ఐసెట్’కు వెళ్లువెత్తుతున్న దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తున్ఆనయి. గతేడాది 75,520 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈసారి ఇప్పటివరకు 80,631 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి గురువారం (ము 16) ఓ ప్రకటనలో తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. రూ.500 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉంటుంది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కన్వీనర్ పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.