Income Tax Raid: భండారీ సోదరుల వ్యాపారాలపై ఐటీ ఆకస్మిక దాడులు.. రూ.170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం!

మహారాష్ట్రంలోని నాందేడ్ ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. షహర్‌లోని భండారీ ఫైనాన్స్‌, ఆదినాథ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులపై ఐటీ బృందం దాడులు చేసింది. ఈ దాడిలో కోట్లాది విలువైన లెక్కలోకి రాని ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. దాదాపు 72 గంటల పాటు ఆదాయపన్ను శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీ మొత్తంలో నగదు లభ్యం అయ్యింది. ఈ దాడిలో భండారీ కుటుంబానికి చెందిన..

Income Tax Raid: భండారీ సోదరుల వ్యాపారాలపై ఐటీ ఆకస్మిక దాడులు.. రూ.170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం!
Income Tax Raid In Nanded
Follow us
Srilakshmi C

|

Updated on: May 16, 2024 | 9:44 AM

నాందేడ్‌, మే 16: మహారాష్ట్రంలోని నాందేడ్ ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. షహర్‌లోని భండారీ ఫైనాన్స్‌, ఆదినాథ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులపై ఐటీ బృందం దాడులు చేసింది. ఈ దాడిలో కోట్లాది విలువైన లెక్కలోకి రాని ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. దాదాపు 72 గంటల పాటు ఆదాయపన్ను శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీ మొత్తంలో నగదు లభ్యం అయ్యింది. ఈ దాడిలో భండారీ కుటుంబానికి చెందిన రూ.170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను ఐటీ డిపార్ట్‌మెంట్ స్వీధీనం చేసుకుంది. ఇందులో 8 కిలోల బంగారం, రూ.14 కోట్ల నగదుతోపాటు పలు ఆస్తులకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా రూ. 170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో దొరికిన రూ.14 కోట్ల నగదును లెక్కించేందుకు అధికారులకు 14 గంటల సమయం పట్టింది. ఆదాయపు పన్ను శాఖ తాజా చర్య ఫైనాన్స్ వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

మహారాష్ట్రలో అన్‌లిస్టెడ్ చిట్ ఫండ్స్, మైక్రో ఫైనాన్స్, లీజింగ్ అండ్‌ గోల్డ్ లోన్ కంపెనీలను నడుపుతున్న భండారీ సోదరులపై వరుసగా మూడు రోజులు దాడులు జరిపారు. భండారీ కుటుంబానికి చెందిన వినయ్ భండారి, సంజయ్ భండారి, ఆశిష్ భండారీ, సంతోష్ భండారీ, మహావీర్ భండారీ, పదం భండారీ వంటి పలువురు పెద్ద ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల పన్ను ఎగవేతపై ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పూణే, నాసిక్, నాగ్‌పూర్, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్, నాందేడ్‌లోని ఆరు చోట్ల వందలాది మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపారు. మే 10న నాందేడ్‌లోని భండారీ ఫైనాన్స్ అండ్‌ ఆదినాథ్ కోఆపరేటివ్ బ్యాంక్‌తో సహా ఆరు చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు.

దాదాపు 100 మంది అధికారుల బృందం 25 వాహనాల్లో నాందేడ్‌కు చేరుకుని.. అలీభాయ్ టవర్‌లోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం, కొఠారీ కాంప్లెక్స్‌లోని కార్యాలయం, కోకాటే కాంప్లెక్స్‌లోని మూడు కార్యాలయాలు, ఆదినాథ్ అర్బన్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లపై దాడులు చేసింది. దీంతో పాటు పరాస్‌నగర్, మహావీర్ సొసైటీ, ఫరాండే నగర్, కాబ్రా నగర్‌లోని ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. కాగా నాందేడ్ జిల్లాలో ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు ఆపరేషన్ కొనసాగించారు. 72 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. అందులో 8 కిలోల బంగారం, రూ.14 కోట్ల నగదు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ టీమ్ ఈ ఆపరేషన్‌ నిమగ్నమై ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!