AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం

మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం
Union Home Ministry
Srikar T
|

Updated on: May 16, 2024 | 10:45 AM

Share

మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ సిమ్ కార్డుల రీవెరిఫికేషన్ విఫలమైతే.. ఆ సిమ్ కనెక్షన్లను తొలగించాలని కంపెనీలకు కేంద్రం సూచించింది. అందువల్ల సిమ్ కార్డు యూజర్లు, మొబైల్ హ్యాండ్ సెట్ ఉన్నవారు ఈ విషయంపై స్పష్టతతో ఉండాలి. సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకోవాలనే టార్గెట్‌గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం వద్ద డేటా ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్.. సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్ సెట్స్‌లో దాదాపు 20 లక్షల నెంబర్లను వినియోగించారు. రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డులు అన్నింటిపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొబైల్ హ్యాండ్ సెట్లపై బ్యాన్ వేయాలని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని సూచించింది. డిజిటల్ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఇటీవలనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది . దీని ద్వారా సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ఇన్‌ఫర్మేషన్ ఎక్స్చేంజ్, రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా జరపొచ్చు. టెలికం కంపెనీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్ ఇలా పలు రకాల విభాగాలు అన్నీ ఈ ప్లాట్‌ఫామ్ కింద లింకై ఉంటాయి. కలిసి పని చేస్తాయి. అందువల్ల సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్