AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nursing Courses After 12th: ఇంటర్‌ తర్వాత బెస్ట్ నర్సింగ్‌ కోర్సులు ఇవే.. భారీ ప్యాకేజీతో విదేశాల్లో ఫుల్ జాబ్స్!

ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత ఏ కెరీర్‌ ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్‌ నర్సింగ్‌. నిజానికి, ఇంటర్‌ తర్వాత ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నర్సింగ్ ఫీల్డ్ ఒకటి. ఇది వైద్య రంగానికి సంబంధించిన వృత్తి. నర్సింగ్‌ ఫీల్డ్‌ నేటి కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెనల్స్‌కు స్వదేశంతోపాటు, విదేశాలలోనూ మరింత డిమాండ్..

Nursing Courses After 12th: ఇంటర్‌ తర్వాత బెస్ట్ నర్సింగ్‌ కోర్సులు ఇవే.. భారీ ప్యాకేజీతో విదేశాల్లో ఫుల్ జాబ్స్!
Nursing Courses After 12th
Srilakshmi C
|

Updated on: May 17, 2024 | 10:22 AM

Share

Career Options After 12th: ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత ఏ కెరీర్‌ ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్‌ నర్సింగ్‌. నిజానికి, ఇంటర్‌ తర్వాత ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నర్సింగ్ ఫీల్డ్ ఒకటి. ఇది వైద్య రంగానికి సంబంధించిన వృత్తి. నర్సింగ్‌ ఫీల్డ్‌ నేటి కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెనల్స్‌కు స్వదేశంతోపాటు, విదేశాలలోనూ మరింత డిమాండ్ ఉంది. మీరూ 12వ తరగతి తర్వాత నర్సింగ్‌ కోర్సు ఎంచుకుంటే ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ఎన్నో రకాలుగా ఉపాధి పొందొచ్చు. అయితే నర్సింగ్‌ను వృత్తిగా ఎంచుకునే వారు ప్రస్తుతం నర్సింగ్ రంగంలో అందుబాటులో ఉన్న కోర్సులు పూర్తి చేస్తేనే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. నర్సింగ్ ఫీల్డ్‌ కెరీర్‌గా ఎంచుకుంటే, మీరు తప్పనిసరిగా అందులోని కోర్సుల వివరాలు తెలుసుకోవల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్‌తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు కూడా ఈ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందడానికి, సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అనంతరం ఉన్నత విద్య కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా చేయవచ్చు.

నర్సింగ్‌లో కొన్ని ప్రధాన కోర్సులు వివరాలు ఇవి..

  • నర్సింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc నర్సింగ్)
  • పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్
  • అసిస్టెంట్ నర్స్ మిడ్‌వైఫరీ (ANM)
  • జనరల్ నర్స్ మిడ్‌వైఫరీ (GNM)
  • నర్సింగ్‌లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ (M.Sc నర్సింగ్)

ఉద్యోగం ఎక్కడ పొందొచ్చు?

నర్సింగ్ విభాగంలో కోర్సు చేశాక.. ముందుగా ప్రైవేట్ ఆసుపత్రుల తలుపులు మీ కోసం తెరుచుకుంటాయి. దీనితో పాటు ఎప్పటికప్పుడు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల రిక్రూట్‌మెంట్‌లు కూడా జరుగుతాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందవచ్చు. ఆసుపత్రులే కాకుండా, ఈ కోర్సు చేస్తున్న అభ్యర్థులు నర్సింగ్‌హోమ్‌లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కౌన్సెలింగ్ కేంద్రాలు, ఆరోగ్య నివాస్, సంరక్షణ కేంద్రాలు, రక్షణ సేవలు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, అలాగే కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలోనూ జాబ్ చేయొచ్చు. అలాగే నర్సింగ్‌ కోర్సు చేసిన తర్వాత దేశంతో పాటు, విదేశాలలో కూడా మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగం పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?