మీ శరీరంలో కేలొరీలను ఇలా సులువుగా తగ్గించుకోండి
ఒంట్లో కేలొరీలు కరిగించాలంటే.. కష్టపడి పని చేయాలి. లేదంటే జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేయాలి. లేదా యోగా చేయాలి. ఇవన్నీ మావల్ల కాదు అనుకుంటే మీ లైఫ్ స్టయిల్‌లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఈజీగా మీ ఒంట్లోని కేలొరీలు సులువుగా కరిగించేయొచ్చు. అవేంటంటే... ఎక్కువ సేపు నిలబడి ఉండటానికి ప్రయత్నించండి.. దీనివల్ల శరీరంలోని కేలొరీలు కరుగుతాయి. కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారు స్టాండింగ్ డెస్క్ ఏర్పాటు చేసకుంటే బెటర్..
ఒంట్లో కేలొరీలు కరిగించాలంటే.. కష్టపడి పని చేయాలి. లేదంటే జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేయాలి. లేదా యోగా చేయాలి. ఇవన్నీ మావల్ల కాదు అనుకుంటే మీ లైఫ్ స్టయిల్‌లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఈజీగా మీ ఒంట్లోని కేలొరీలు సులువుగా కరిగించేయొచ్చు. అవేంటంటే… ఎక్కువ సేపు నిలబడి ఉండటానికి ప్రయత్నించండి.. దీనివల్ల శరీరంలోని కేలొరీలు కరుగుతాయి. కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారు స్టాండింగ్ డెస్క్ ఏర్పాటు చేసకుంటే బెటర్.. అప్పుడు ఎక్కువ సమయం నిల్చుని వర్క్ చేసుకోవచ్చు..కొందరు పనిలో పడితే కుర్చీకే అతుక్కుపోతారు. ఇది అస్సలు మంచిది కాదు. అప్పుడప్పుడూ లేచి అలా నాలుగు అడుగులు వేస్తూ ఉండండి. పాంట్రీకి వెళ్లండి, లేదా ఒక 5 నిమిషాలు వాష్‌రూమ్ వైపు వెళ్లి కాస్త నడవండి. దీనివల్ల మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. వీలైనప్పుడల్లా ఒంటికాలిపై నిల్చునే ప్రయత్నం చేయండి దాంతో పాదాల కండరాలు, పిక్కల భాగంలో అధిక బరువు పడుతుంది. ఇదికూడా కేలొరీలు కరిగించడంలో ఉపయోగపడుతుంది. కొద్ది దూరమైనా స్పీడుగా నడవడం అలవాటు చేసుకోండి. ఆఫీసుకు బయలుదేరేముందు, ఇంటికి వచ్చే సమయంలో ఇలా చేస్తే మంచింది. ఆఫీసులో లిఫ్ట్‌కి బదులు మెట్లు ఎక్కి వెళ్లండి. వీలైనన్ని సార్లు మెట్లు ఎక్కి, దిగడం వల్ల కేలొరీలు సులువుగా ఖర్చవుతాయి. నలుగురు ఓ చోట చేరితే కబుర్లతో కాక్షేపం చేస్తారు. అలాకాకుండా బౌలింగ్, త్రోడార్ట్స్, ప్లే పూల్ వంటి ఆటలు ఆడుతూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక మీరు ఎప్పుడు వాకింగ్‌కి వెళ్లినా మంచి మ్యూజిక్ వినండి. దానివల్ల కష్టం తెలియదు. కాస్త ఎక్కువ దూరం సులువుగా నడిచేస్తారు. అప్పుడు త్వరగా కేలొరీలు కరుగుతాయి. మీరు షాపింగ్‌లకు వెళ్లినప్పుడు మీ వర్కౌట్స్ మిస్ కాకుండా చూసుకోండి. పార్కింగ్ దాకా నడిచి వెళ్లండి, స్టాల్స్ మొత్తం తిరిగి చూడండి.. కొన్న వస్తువులు మీరే మోసుకొని తెచ్చుకోండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందుకే నాకు పిల్లలు వద్దు.. రూ. 28 వేల కోట్ల ఆస్తిని ఎవరికిస్తానంటే
బైడెన్‌ను చంపాలనుకున్నా.. విచారణలో తెలుగు కుర్రాడు సాయి వర్షిత్
తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ?? నిజమెంత ??
Air India Express: విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై