AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ?? నిజమెంత ??

తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ?? నిజమెంత ??

Phani CH
|

Updated on: May 17, 2024 | 12:00 PM

Share

సాధారణంగా వ్యవసాయ పనులలో రైతులకు, ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది. అత్యంత అరుదుగా తేలు కాటేయడం ద్వారా వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు. తేలు కుడితే అస్సలు లైట్ తీసుకోవద్దు. పాముతో పోల్చుకుంటే తేలు విషం తక్కువ ప్రమాదకరమైనదే అయినా.. కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం లేకపోలేదు. తేలు అనే ఈ విష కీటకం అరాగ్నిడా జంతు తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జీవి.

సాధారణంగా వ్యవసాయ పనులలో రైతులకు, ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది. అత్యంత అరుదుగా తేలు కాటేయడం ద్వారా వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు. తేలు కుడితే అస్సలు లైట్ తీసుకోవద్దు. పాముతో పోల్చుకుంటే తేలు విషం తక్కువ ప్రమాదకరమైనదే అయినా.. కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం లేకపోలేదు. తేలు అనే ఈ విష కీటకం అరాగ్నిడా జంతు తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జీవి. వీటిలో 1500 వందల రకాల జాతులున్నాయి. తొలుత తేలు కుట్టగానే.. తీవ్రమైన మంట, నొప్పి ఉంటాయి. కొంతమందికి కుట్టిన ప్రాంతంతో పాటు ఆ కాలు లేదా చేయి మొత్తం పెయిన్ ఉంటుంది. ఒకరోజంతా ఈ నొప్పి ఉంటుంది. తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే అది ప్రాణాంతకం కాదు. పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ తేలు కుడితే నాటు వైద్యుల్నే ఆశ్రయిస్తారు. ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేసే ప్రమాదకర తేళ్లు 30 రకాలు ఉన్నాయట. అవి కుడితే ప్రాణాలు పోతాయని వైద్య నిపుణుల చెబుతున్నారు. తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి తేలు కుట్టిన చోట రుద్దుతూ ఉంటే 5 నిమిషాల్లోనే తేలు విషం విరిగిపోతుందని కొందరు చెబుతుంటారు. ఇది కరెక్ట్ కాదు.. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలో వాపుని తగ్గించే గుణం ఉన్నప్పటికీ, ఇది తేలు కాటుకి సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు. కొన్ని జాతులకు చెందిన తేళ్ళ విషం ప్రాణాంతకమైనదిగా ఉంటుంది. మీరు ఇలాంటి సోషల్ మీడియా చిట్కాలను నమ్మి.. చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. అగ్గిపుల్లలకు ఉండే పొడిని.. నీటిలో కలిపి తేలు కుట్టిన చోట రాస్తే వెంటనే.. విషం పోతుందని ప్రచారంలో ఉంది. దీనికి కూడా ఎలాంటి శాస్త్రీయ నిబద్ధత లేదు. దయచేసి ఇలాంటి నాటు పద్దతలు పాటించవద్దు. ఏదైనా విష కీటకం కాటుకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Air India Express: విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై

Banana: అరటిపళ్లను ఇలా మగ్గిస్తే.. ఆ టేస్టే వేరబ్బా

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే

Chat GPT: అత్యాధునిక ఫీచర్లతో చాట్ జీపీటీ-4ఓ.. అందరికీ ఫ్రీ

బైక్‌పై ఎలుగుబంటి సరదా సరదాగా షికారు.. వీడియో నెట్టింట ఫుల్ వైరల్

Published on: May 17, 2024 11:58 AM