AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే

Phani CH
|

Updated on: May 17, 2024 | 4:41 PM

Share

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ-20 వరల్డ్‌ కప్‌తో ముగుస్తుంది. ద్రావిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 మే 2024. ఎంపిక ప్రక్రియలో ఎవరు దరఖాస్తును పంపినా సమీక్షిస్తారు. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ-20 వరల్డ్‌ కప్‌తో ముగుస్తుంది. ద్రావిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 మే 2024. ఎంపిక ప్రక్రియలో ఎవరు దరఖాస్తును పంపినా సమీక్షిస్తారు. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ప్రధాన కోచ్ పదవి 1 జులై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు 3.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే కొత్త కోచ్‌ 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకూ పదవిలో కొనసాగుతారు. ఇక బీసీసీఐ ఇచ్చిన తాజా ప్రక‌ట‌న ప్రకారం.. కొత్త కోచ్‌కు 14 నుంచి 16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్‌ కోచ్ గా కొన‌సాగుతారు. టీమ్‌ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తారు. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తారు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్‌లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యత అని బీసీసీఐ త‌న ప్రక‌ట‌న‌లో పేర్కొంది. అలాగే హెడ్ కోచ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హత‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా బీసీసీఐ వెల్లడించింది. కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వ‌న్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. ఐపీఎల్‌ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్‌, ఫస్ట్ క్లాస్ జట్లకు లేదా జాతీయ A జ‌ట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు ప‌నిచేసి ఉండాలి. లేదా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ కండిష‌న్లలో ఏది ఉన్నా స‌రే.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని బీసీసీఐ తెలిపింది. ఇక పారితోషికం అనుభవాన్ని బ‌ట్టి ఉంటుంద‌ని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chat GPT: అత్యాధునిక ఫీచర్లతో చాట్ జీపీటీ-4ఓ.. అందరికీ ఫ్రీ

బైక్‌పై ఎలుగుబంటి సరదా సరదాగా షికారు.. వీడియో నెట్టింట ఫుల్ వైరల్

Published on: May 17, 2024 11:47 AM