Chat GPT: అత్యాధునిక ఫీచర్లతో చాట్ జీపీటీ-4ఓ.. అందరికీ ఫ్రీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAI చాట్‌జీపీటీలో కొత్త వెర్షన్ విడుదల చేసింది. పేరు జీపీటీ-4ఓ .. ఓ అంటే ఓమ్ని అన్నమాట. త్వరలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, కొన్ని పరిమితులుంటాయని పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవని తెలిపింది. జీపీటీ-4ఓలో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుందని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటీ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAI చాట్‌జీపీటీలో కొత్త వెర్షన్ విడుదల చేసింది. పేరు జీపీటీ-4ఓ .. ఓ అంటే ఓమ్ని అన్నమాట. త్వరలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, కొన్ని పరిమితులుంటాయని పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవని తెలిపింది. జీపీటీ-4ఓలో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుందని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటీ తెలిపారు. సబ్‌స్క్రిప్షన్ ధర సగానికి తగ్గుతుందని తెలిపారు. కొత్త మోడల్ దాదాపు 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటిలో తెలుగు కూడా ఉండడం విశేషం. వాయిస్ కమాండ్లకు మనిషి తరహాలోనే కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్‌లో టర్బో కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మరోవైపు మ్యాక్ ఓఎస్ యూజర్లకు డెస్క్‌టాప్ యాప్‌ను, మరికొన్ని రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. జీపీటీ-4ఓ ఫీచర్లకు సంబంధించిన సమాచారాన్ని ఓపెన్‌ఏఐ తమ పోస్ట్‌లో వివరించింది. కొత్త వెర్షన్ పనితీరును తెలియజేస్తూ కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేసింది. దాంట్లో యూజర్లు ఇచ్చే వాయిస్ కమాండ్లకు మనిషి తరహాలోనే జీపీటీ సమాధానం ఇస్తుండడం గమనించొచ్చు. పైగా ఒక ఫోన్‌లోని ఏఐ మోడల్ మరో ఫోన్‌లోని జీపీటీ వెర్షన్‌తో దానికదే సంభాషించడం కనిపించింది. అలాగే యూజర్ సెల్ఫీ వీడియోను విశ్లేషించి వారి మానసిక స్థితి ఎలా ఉందో కూడా చెప్పడం విశేషం. గూగుల్ కూడా తమ ఏఐ మోడల్ జెమినీకి కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై ఎలుగుబంటి సరదా సరదాగా షికారు.. వీడియో నెట్టింట ఫుల్ వైరల్
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

