బైడెన్‌ను చంపాలనుకున్నా.. విచారణలో తెలుగు కుర్రాడు సాయి వర్షిత్‌

బైడెన్‌ను చంపాలనుకున్నా.. విచారణలో తెలుగు కుర్రాడు సాయి వర్షిత్‌

Phani CH

|

Updated on: May 17, 2024 | 12:01 PM

గతేడాది వైట్‌హౌస్‌ వద్ద ట్రక్‌తో దాడి చేసిన ఘటనలో నిందితుడైన భారత సంతతి కుర్రాడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు అటార్నీ తెలిపింది. దీంతో ఈ కేసులో శిక్ష ఆగస్టు 23న ఖరారు చేయనున్నట్లు యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు తెలిపింది.

గతేడాది వైట్‌హౌస్‌ వద్ద ట్రక్‌తో దాడి చేసిన ఘటనలో నిందితుడైన భారత సంతతి కుర్రాడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు అటార్నీ తెలిపింది. దీంతో ఈ కేసులో శిక్ష ఆగస్టు 23న ఖరారు చేయనున్నట్లు యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు తెలిపింది. కోర్టు పత్రాల ప్రకారం.. 2023 మే 22వ తేదీ సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి సాయి వర్షిత్‌ వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్‌ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఇందుకోసం అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్‌, ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఘటనకు విచారణలో రుజువైందని యూఎస్‌ అటార్నీ తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ?? నిజమెంత ??

Air India Express: విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై

Banana: అరటిపళ్లను ఇలా మగ్గిస్తే.. ఆ టేస్టే వేరబ్బా

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే

Chat GPT: అత్యాధునిక ఫీచర్లతో చాట్ జీపీటీ-4ఓ.. అందరికీ ఫ్రీ