అందుకే నాకు పిల్లలు వద్దు.. రూ. 28 వేల కోట్ల ఆస్తిని ఎవరికిస్తానంటే

అందుకే నాకు పిల్లలు వద్దు.. రూ. 28 వేల కోట్ల ఆస్తిని ఎవరికిస్తానంటే

Phani CH

|

Updated on: May 17, 2024 | 12:02 PM

జెరోధా ఫౌండర్ 'నిఖిల్ కామత్' ఇటీవల పిల్లల్ని కనటం, వారి పెంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. వారసత్వం కోసం పిల్లలను కనటం అనేది సరైనది కాదని తన అభిప్రాయాలను ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను ప్రస్తుత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తానని, పిల్లల పెంపకం కోసం తన జీవితంలో ఎక్కువ రోజులను అంకితం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు ఉంటే వారి కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

జెరోధా ఫౌండర్ ‘నిఖిల్ కామత్’ ఇటీవల పిల్లల్ని కనటం, వారి పెంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. వారసత్వం కోసం పిల్లలను కనటం అనేది సరైనది కాదని తన అభిప్రాయాలను ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను ప్రస్తుత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తానని, పిల్లల పెంపకం కోసం తన జీవితంలో ఎక్కువ రోజులను అంకితం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు ఉంటే వారి కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది తనకు ఇష్టం లేదని చెప్పారు. జీవితంలో పిల్లల కోసం ఎక్కువ రోజులు వెచ్చించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పిల్లల్ని కంటే.. వారి సంరక్షణ కోసం జీవితంలో 18 నుంచి 20 ఏళ్ళు వెచ్చించాలనీ జీవితంలో 18-20 సంవత్సరాలు వృథా కావచ్చని తెలిపారు. మరణం తరువాత గుర్తుండిపోయేలా.. పిల్లలను కనటంలో ప్రయోజనం ఏమిటని అడిగారు. ప్రతి ఒక్కరూ జీవించాలి, జీవితంలో ప్రతిరోజూ కలుసుకునే వారితో మంచిగా ఉండాలని నిఖిల్ కామత్ అన్నారు. భారతీయుడి సగటు జీవిత కాలం 72 సంవత్సరాలనీ తనకు ప్రస్తుతం 37 సంవత్సరాలనీ ఇప్పటికే సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో వృథాగా వదిలేయకుండా స్వచ్చంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. నిఖిల్‌ కామత్ 2023 జూన్‌లో.. తన సంపద మొత్తంలో సగం వరకు సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ది గివింగ్ ప్లెడ్జ్ అంటే సంపద దానం కోసం.. ప్రమాణం చేసిన వారిలో భారత్‌లో పిన్న వయస్కుడు కూడా ఈయనే. వేల కోట్లు సంపాదించినా ఇప్పటికీ నిఖిల్ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు ఈయన వ్యతిరేకం. రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే అద్దె ఇంట్లో ఉంటున్నట్లు గతంలో చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైడెన్‌ను చంపాలనుకున్నా.. విచారణలో తెలుగు కుర్రాడు సాయి వర్షిత్‌

తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ?? నిజమెంత ??

Air India Express: విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై

Banana: అరటిపళ్లను ఇలా మగ్గిస్తే.. ఆ టేస్టే వేరబ్బా

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే