Viral Video: అయ్యయ్యో.. ఇలా జరిగింది ఏంటి..? చివరకు

Viral Video: అయ్యయ్యో.. ఇలా జరిగింది ఏంటి..? చివరకు

Ram Naramaneni

|

Updated on: May 17, 2024 | 3:00 PM

కర్నాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికురాలి తల కిటికీలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు డ్రైవర్, తోటి ప్రయాణికులు అతికష్టం మీద ఆమె తలను బయటకు తీశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఊహించని సంఘటన.. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మనం సాధారణంగా ఉక్కపోతకు గురైనప్పుడు చల్లని గాలి కోసం కిటికీలు తెరుస్తుంటాం..అప్పడప్పుడు తలను బయటకు పెట్టి చల్లని గాలిని ఆస్వాదిస్తుంటాం.. అయితే ఇది ప్రమాదకరమని మనకు డ్రైవర్, కండక్టర్ హెచ్చరిస్తుంటారు. ఇదంతా కామన్ గా అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తూ ఊహించని విధంగా బస్సు కిటికీ అద్దాల్లో తలపెట్టి ఇరుక్కుపోయింది.. తలను ఎలా విడిపించుకోవాలో తెలియన నానా అవస్థలు పడింది. కర్నాటక కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు ఈ వింత అనుభవం ఎదురైంది. మహిళ అవస్థను గమనించిన తోటి ప్రయాణికులు.. కండెక్టర్, డ్రైవర్‌కు విషయం చెప్పడంతో బస్సు ఆపారు. తర్వాత అతి కష్టం మీద మహిళ తలను బయటకు తీయడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..