Viral Video: హెటల్‌లో అగ్నిప్రమాదం.. అరగంటకు అక్కడికి చేరుకున్న ఫైరింజన్.. ఆ తర్వాత ట్విస్ట్

Viral Video: హెటల్‌లో అగ్నిప్రమాదం.. అరగంటకు అక్కడికి చేరుకున్న ఫైరింజన్.. ఆ తర్వాత ట్విస్ట్

Ram Naramaneni

|

Updated on: May 17, 2024 | 6:05 PM

ఉడిపిలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది . హోటల్ యజమాని వెంటనే బ్రహ్మగిరి అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించారు . అరగంట తర్వాత అగ్నిమాపక యంత్రం ఘటనాస్థలికి చేరుకుంది. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.

కర్నాటక ఉడిపిలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది . హోటల్ యజమాని ప్రమాదం జరిగిన ప్రదేశానికి కేవలం 1.5 కి.మీ దూరంలో ఉన్న బ్రహ్మగిరిలోని అగ్నిమాపక కేంద్రానికి విషయాన్ని వెంటనే చేరవేశారు. అరగంట తర్వాత అగ్నిమాపక యంత్రం ఘటనాస్థలికి చేరుకుంది. ఫైరింజన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను ఆర్పేందుకు సరంజామా అంతా సెట్ చేసుకుంటూ ఉండగా.. ట్యాంకర్‌లో లేవని గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న జనాలందరూ బిత్తరపోయారు. నీళ్లు నింపుకుని మళ్లీ వస్తామని చెప్పి ఫైర్ ఫైటర్స్ కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అదృష్టవశాత్తూ, కాసేపటి తర్వాత వర్షం కురియడంతో, స్థానికులు, అక్కడే ఉన్న కొంతమంది అగ్నిమాపక సిబ్బందితో కలిసి వర్షం నీటిని ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, భవనం దాదాపు పూర్తిగా దగ్ధమైంది, మంటలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఫైరంజిన్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. ఫైరింజన్‌లో వాటర్ లేకపోవడం వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. దీనిపై క్లారిటీ కోసం మీడియా ఫైర్‌ సర్వీస్‌ స్టేషన్‌ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు రెస్పాండ్ అవ్వలేదు. అగ్నిమాపక దళం చేసిన తప్పిదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: May 17, 2024 04:32 PM