Srikakulam: చేపల కోసం వల వేసిన జాలర్లు.. ఏం చిక్కిందో తెలిస్తే స్టన్ …

సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లకు చిత్ర విచిత్రమైన చేపలు చిక్కుతూ ఉంటాయి. కొన్నిసార్లు అరుదైన ఔషధ గుణాలు ఉన్న చేపలు కూడా వలల్లో పడుతూ ఉంటాయి. అలాంటివి దొరికాయంటే వారికి పండగే అని చెప్పాలి. తాజాగా.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు 6 అడుగుల అరుదైన సముద్ర పాము చిక్కింది.

Srikakulam: చేపల కోసం వల వేసిన జాలర్లు.. ఏం చిక్కిందో తెలిస్తే స్టన్ ...

| Edited By: Ram Naramaneni

Updated on: May 17, 2024 | 9:48 PM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు 6 అడుగుల అరుదైన సముద్ర పాము చిక్కింది. ప్రస్తుతం సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారులు సంప్రదాయ వలతో వేట సాగించగా.. ఈ పాము వాళ్ల వలకు చిక్కింది. ఇది విషపూరితం కాదని, కొన్ని ప్రాంతాల వారు పాము తలను తొలగించి మిగిలిన భాగాన్ని వండుకొని తింటారని స్థానిక జాలర్లు చెబుతున్నారు. ఈ పాము మాంసం తింటే వెన్నుపూసకు మంచిదని స్థానికంగా చెబుతున్నారు. కాగా ఈ అరుదైన సముద్ర పామును చూసేందుకు మంచినీళ్ల పేటకు పరిసర గ్రామాల ప్రజలు క్యూ కట్టారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow us
Latest Articles