చనిపోయన పాముకు ఘనంగా అంతిమయాత్ర

చనిపోయన పాముకు ఘనంగా అంతిమయాత్ర

Phani CH

|

Updated on: May 18, 2024 | 2:32 PM

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. చనిపోయిన ఓ పాముకి స్థానికులు ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనియాంశంగా మారింది. ఈ వార్త విన్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు అది భగవంతుని మహిమగా చెప్పుకుంటున్నారు.. పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో మేళం వారి మెరక ప్రాంతంలో చనిపోయిన ఓ త్రాచుపాముని స్థానికులు గుర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. చనిపోయిన ఓ పాముకి స్థానికులు ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనియాంశంగా మారింది. ఈ వార్త విన్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు అది భగవంతుని మహిమగా చెప్పుకుంటున్నారు.. పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో మేళం వారి మెరక ప్రాంతంలో చనిపోయిన ఓ త్రాచుపాముని స్థానికులు గుర్తించారు. అయితే ఆ త్రాచుపాము ఎలా చనిపోయింది కారణాలు మాత్రం తెలియలేదు. దాంతో అక్కడకు చేరుకున్న కొందరు స్థానికులు చనిపోయిన పాము మృతదేహాన్ని అలా విడిచి పెట్టడం పాపమని, పాము భగవంతుని స్వరూపమని, ఆ పరమశివుడి కంటాభరణంగా అత్యంత శక్తివంతమైన జీవిగా భూమీ మీద నివసించే పామును దేవతగా ఆరాధిస్తారు. అలాంటి పామును మృతదేహాన్ని ఇలా వదిలేయడం సరికాదని, దానికి ఘనంగా దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనుషులకు అంతిమ యాత్ర నిర్వహించినట్టే చనిపోయిన పాముకు అంతిమ యాత్ర నిర్వహించారు. కట్టెలపాడె సిద్ధం చేసి పాము మృతదేహాన్ని దానిపై ఉంచి ఊరేగించారు.ఈ ఊరేగింపులో గ్రామస్తులంతా పాల్గొన్నారు. అంతకు ముందు పాము మృతదేహానికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ పోటీ పడి మరీ ఆత్రాచు పాము పాడెను మోస్తూ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు ఘనంగా నిర్వహించారు. సాధారణంగా భగవంతుని స్వరూపంగా భావించే జంతువులు మృతి చెందినప్పుడు దహనం చేయడం ద్వారా వాటి ఆత్మలకు శాంతి చేకూరి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని హిందువుల నమ్మకం..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AP: ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని

ఈ సమయాల్లో టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. ఐసీఎమ్ఆర్ కీలక సూచన

TOP 9 ET News: గుడ్‌ న్యూస్‌ !..ప్రభాస్‌ భారీ ఈవెంట్ | వావ్ ! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య