AP: ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని

దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికితీసేందుకు రూ. 200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు.

AP: ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని

|

Updated on: May 18, 2024 | 2:31 PM

దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికితీసేందుకు రూ. 200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలైతే ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. మరోవైపు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని బంగారం గనులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (NMDC) ఆసక్తి చూపుతోంది. ఈ గనులను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది. కాగా, దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ కు దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో లిథియమ్‌ గనులను ఆ సంస్థ తాజాగా కొనుగోలు చేసింది. రోజుకు 100 టన్నుల లిథియం, ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు భారీ ప్లాంట్లు నిర్మిస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ సమయాల్లో టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. ఐసీఎమ్ఆర్ కీలక సూచన

TOP 9 ET News: గుడ్‌ న్యూస్‌ !..ప్రభాస్‌ భారీ ఈవెంట్ | వావ్ ! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య

Follow us
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!