ఈ సమయాల్లో టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. ఐసీఎమ్ఆర్ కీలక సూచన
టీ, కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, టీ, కాఫీలు పరిమితంగానే తాగాలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా సూచించింది. ముఖ్యంగా భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు టీ, కాఫీలు అస్సలు తాగొద్దని హెచ్చరించింది. ఈ సమయాల్లో టీ, కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతుందని పేర్కొంది. కాఫీ, టీల్లోని కెఫీన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ పానీయాలతో కొత్త ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది.
టీ, కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, టీ, కాఫీలు పరిమితంగానే తాగాలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా సూచించింది. ముఖ్యంగా భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు టీ, కాఫీలు అస్సలు తాగొద్దని హెచ్చరించింది. ఈ సమయాల్లో టీ, కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతుందని పేర్కొంది. కాఫీ, టీల్లోని కెఫీన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ పానీయాలతో కొత్త ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ఇదే అలవాటుగా మారి చివరకు కాఫీ, టీలు లేనిదే క్షణకాలం కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అయితే, రోజుకు కెఫీన్ 300 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం, కప్పు కాఫీలో గరిష్ఠంగా 120 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. కప్పు టీలో 65 గ్రాముల కెఫీన్ ఉంటుంది. కాఫీ, టీల్లో టానిన్ అనే కాంపౌండ్ ఉంటుందని ICMR పేర్కొంది. ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుపడుతుందని, కాబట్టి, భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు ఎట్టిపరిస్థితుల్లో కాఫీ, టీలు తాగొద్దని ICMR నిపుణులు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ తయారీకి కీలకమైన ఐరన్ లేమితో రక్తహీనత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ తగ్గితే, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తరచూ తలనొప్పి, గుండెదడ, చర్మం రంగు పాలిపోయినట్టు ఉండటం తదితర సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. గోళ్లు పెళుసుగా మారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని అంటున్నారు. అయితే, పాలు లేని టీ రక్తప్రసరణకు మంచిదని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. గుండె రక్తనాళాలు, ఉదర సంబంధిత సమస్యలను ఇది దరిచేరనీయదని చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: గుడ్ న్యూస్ !..ప్రభాస్ భారీ ఈవెంట్ | వావ్ ! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

