USA Road Accident: వెంటాడిన మృత్యువు.. అమెరికాలో జహీరాబాద్‌ యువకుడి దుర్మరణం! రెప్పపాటులో 2 యాక్సిడెంట్లు

ఒక్కోసారి మృత్యువు పగబట్టినట్లు వెంటాడుతుంది. ఎన్నిసార్లు తప్పించుకున్నా ఏదో ఒక విధంగా ప్రాణాలను హరిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక ప్రమాదం తప్పించుకుని హమ్మయ్య.. అనుకునే లోపు కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు..

USA Road Accident: వెంటాడిన మృత్యువు.. అమెరికాలో జహీరాబాద్‌ యువకుడి దుర్మరణం! రెప్పపాటులో 2 యాక్సిడెంట్లు
USA Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: May 17, 2024 | 12:08 PM

నార్త్ కరోలినా, మే16: ఒక్కోసారి మృత్యువు పగబట్టినట్లు వెంటాడుతుంది. ఎన్నిసార్లు తప్పించుకున్నా ఏదో ఒక విధంగా ప్రాణాలను హరిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక ప్రమాదం తప్పించుకుని హమ్మయ్య.. అనుకునే లోపు కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందాడు మధుర వెంకటరమణ. అనంతరం అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది. అనారోగ్యంతో రెండేళ్ల కిందటే ఆయన మృతి చెందారు. అయన కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) ఎనిమిదేండ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. పృథ్వీరాజ్‌ యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది శ్రీప్రియను వివాహం చేసుకున్న పృథ్వీరాజ్‌.. భార్యతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో వీరి కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో అది రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదే సమయానికి తమ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

అనంతరం భార్యను కారులోనే కూర్చోబెట్టి, బయటికి వచ్చిన పృథ్వీరాజ్‌ ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం అందించేందుకు ఫోన్‌ చేస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎదిగిన కొడుకు మృత్యువాత పడటంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.