Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
ఒడిశా,చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఎన్‌కౌటంర్ జరిగినట్టు అధికారులు తెలిపారు.

ఒడిశా,చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అది గమనించిన మావోయిస్టులు.. పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులకు కాల్పుల్లో సుమారు ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. మరికొంత మంది గాయపడినట్టు తెలుస్తోంది.
అధికారు తెలిపిన వివరాల ప్రకారం.. కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, అమృత్ అనే మావోయిస్టు మృతి చెందినట్టు తెలిపారు. అయితే మరణించిన మరో ముగ్గురి వివరాలు మాత్రం ఇంకా తెలియదని స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన వారిలో రాకేష్‌పై రూ.22 లక్షలు, అమృత్‌పై రూ.1.65 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
